7 Healthy Alternatives To White Sugar: ఈ కాలంలో ఆరోగ్యంపై స్పృహ అందరిలో పెరిగింది. ఈ నేపథ్యంలో చక్కెరను కూడా తగ్గిస్తున్నారు.
7 Healthy Alternatives To White Sugar: ఈ కాలంలో ఆరోగ్యంపై స్పృహ అందరిలో పెరిగింది. ఈ నేపథ్యంలో చక్కెరను కూడా తగ్గిస్తున్నారు. దీంతో అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇది ఒబేసిటీ, డయాబెటిస్, గుండె సమస్యలకు కారణమవుతుంది. చక్కెరకు బదులుగా మీ డైట్లో చేర్చుకోవాల్సిన ఆహారాలు ఏముంటాయో తెలుసుకుందాం.
పామ్ ట్రీ నుంచి తయారు చేస్తారు. కొకనట్ షుగర్‌లో గ్లైసెమిక్స్ ఇండెక్స్ సూచి తక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెరను మెల్లగా విడుదల చేస్తుంది. అంతేకాదు కొకనట్ షుగర్‌లో ఐరన్, జింక్, కాల్షియం కొద్ది మొత్తంలో పోషకాలు ఉంటాయి. ఇది కూడా క్యారమల్ ఫ్లేవర్ ఉంటుంది. ఈ షుగర్‌ను బేకింగ్, బీవరేజెస్ రిసిపీల్లో చక్కెరకు బదులుగా వాడచ్చు.
చక్కెరకు బదులుగా మీ డైట్లో తేనెను చేర్చుకోవచ్చు. తేనెలో యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ మైక్రోబియల్ గుణాలుంటాయి. ఇది మన ఆహారాలకు మంచి రుచిని ఇస్తుంది. ఇందులో ఎన్నో పోషకాలు ఉంటాయి. కానీ, ప్రాసెస్ చేసిన చక్కెరలో ఎంజైమ్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉండవు.
మ్యాపుల్ సిరప్‌లో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇందులో మెగ్నిషియం, జింక్ వంటి మినరల్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఇన్ల్ఫమేషన్ సమస్యను తగ్గిస్తుంది. మ్యాపుల్ సిరప్ కూడా ప్యూరిటీని చెక్ చేసి తీసుకోండి. ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కాకుండా గ్రేడ్ ఏ వెరైటీ తీసుకోండి.
స్టివియా మొక్క నుంచి స్టివియా వస్తుంది. ఇది చక్కెరకు బదులుగా బెస్ట్ అల్టర్‌నేటివ్. ఇందులో కేలరీలు, షుగర్ లెవల్స్ తక్కువగా ఉంటాయి. స్టీవియా ముఖ్యంగా డయాబెటిస్‌తో బాధపడేవారికి ఉత్తమం. దీంతో బరువు కూడా నిర్వహించబడుతుంది.
ఖర్జూరాన్ని నానబెట్టి తయారు చేస్తారు. ఇది కూడా చక్కెరకు బదులుగా వినియోగించవచ్చు. షుగర్ వ్యాధిగ్రస్థులకు మంచి ఎంపిక. అంతేకాదు ఇందులో ఫైబర్ తోపాటు పొటాషియం, మెగ్నిషియం వంటి మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది వైట్ షుగర్‌కు మంచి ఎంపిక. ఇది స్మూథీ, బేకింగ్ ఫుడ్స్, డ్రెస్సింగ్స్‌గా వాడతారు.
మాంక్ ఫ్రూట్ నుంచి తయారు చేస్తారు. ఇది గ్రీన్ కలర్ లో ఉంటుంది. సౌత్ ఈస్ట్ ఏషియాలో విస్తృత్తంగా వీటిని వినియోగిస్తారు. ఇందులో క్యాలరీలు కూడా తక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మాంక్ ఫ్రూట్‌లో మోగ్రోసైడ్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది షుగర్ మాదిరి తీపి రుచిని కలిగి ఉంటుంది. మార్కెట్లో ఇవి గ్రాన్యూల్స్ గా కూడా విక్రయిస్తారు.
మొలాసిస్ నల్లని సిరప్ మాదిరి ఉంటుంది. ఇందులో ఎన్నో పోషకాలు ఉంటాయి. మొలాసిస్‌లో ఐరన్, కాల్షియం, మెగ్నిషియం, పొటాషియం ఉంటాయి.. ఇది షుగర్‌కు బెస్ట్ అల్టార్‌నేటివ్.