Top South Actresses: ఫోర్బ్స్ ఇండియా అండర్ 30 జాబితాలో ఎవ్వరు ఊహించని ఒక హీరోయిన్.. చోటు దక్కించుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. సమంత, నయనతార, త్రిష, సాయి పల్లవి.. వీరందరిని దాటిపోయిన ఈ హీరోయిన్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం చర్చ జరుగుతుంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో ఒకసారి చూద్దాం..
సినీ పరిశ్రమలో నయనతార, సాయి పల్లవి, రష్మిక మందన్న, త్రిష, సమంత వంటి అగ్రతారలు.. ఎంతోమంది దృష్టిని ఎప్పటికప్పుడు ఆకర్షిస్తూ ఉంటారు. ఒకరకంగా ప్రస్తుతం టాప్ హీరోయిన్ ఎవరు అంటే.. వీళ్ళ పేర్లల్లోనే ఎవరో ఒకరి పేరు వినిపిస్తుంది.
అయితే 2025 సంవత్సరానికి గాను ఫోర్బ్స్ 30 అండర్30 జాబితాలో ఊహించని పేరు చోటు చేసుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.ప్రఖ్యాత అమెరికన్ మ్యాగజైన్ ఫోర్బ్స్ ప్రతి ఏడాది భారతదేశంలో అత్యంత ప్రతిభావంతమైన 30 మంది వ్యక్తుల జాబితాను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ ఏడాదికి గానూ 2025 కు సంబంధించి ఆ మ్యాగజైన్ 30 ఏళ్లలోపు 30 మంది ప్రముఖ వ్యక్తుల జాబితాను వెల్లడించింది. అందులో సినీ రంగం నుండి ఒకే ఒక్క వ్యక్తిని చేర్చడం గమనార్హం.
ఆమె ఎవరో కాదు అపర్ణ బాల మురళి. ఫోర్బ్స్ జాబితాలో ఊహించని పేరు నమోదు కావడంతో పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఇదే జాబితాలో బాలీవుడ్ నటుడు రోహిత్ సరాఫ్ కూడా చోటు దక్కించుకున్నారు.
గత ఏడాదికాలంగా పెరుగుతున్న ప్రజాదారణ వారి స్థానాలను దక్కించుకోవడంలో కీలకపాత్ర పోషించింది. ఇకపోతే ఏడాది అపర్ణ.. ధనుష్ దర్శకత్వం వహించిన తమిళ చిత్రం రాయన్ లో నటించి భారీ పాపులారిటీ అందుకుంది.