Airport UDAN Yatri Cafe Price List Will Shocking Checkout: విమాన ప్రయాణికులకు భారీ శుభవార్త. ఎయిర్‌పోర్టులో ఏది తినాలన్నా.. తాగాలన్నా భయపడుతుండేవారు. అక్కడి ధరలు చూసి నోళ్లు కట్టేసుకునేవాళ్లు. ఇప్పుడు ఆ అవసరం లేదు. కొత్తగా ప్రారంభించిన ఉడాన్ యాత్రి కేఫ్ ద్వారా రూ.10కే.. రూ.20కే సమోసా.. ఇలా అతి తక్కువకే లభిస్తున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
ఎయిర్‌పోర్టుల్లో తినాలన్నా.. తాగాలన్నా భయమే. అంతలా భారీగా ధరలు ఉంటాయి. సామాన్యుడు కొనలేని పరిస్థితి.
అధిక ధరల ఇబ్బందులను గమనించిన పౌర విమానయాన శాఖ సరికొత్త కార్యక్రమం ప్రారంభించింది.
ఉడాన్ యాత్రి కేఫ్ పేరిట అతి తక్కువ ఖర్చులకే టీ, కాఫీ, సమోసాతోపాటు నీళ్ల సీసా అందుబాటులోకి తీసుకువచ్చింది.
ప్రయోగాత్మకంగా కలకత్తా ఎయిర్‌పోర్టులో యుడాన్ యాత్రి కేఫ్‌ను మన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు.
ఈ కేఫ్‌లో రూ.10 కే ఛాయ్.. రూ.20కి కాఫీ, సమోసా, స్వీట్ లభిస్తున్నాయి. ఇక నీళ్ల సీసా అయితే రూ.10 మాత్రమే.
మిగతా తినుభండారాలు.. పానీయాలు కూడా ఆరు బయట లభించే ధరల్లోను అందుబాటులో ఉన్నాయి.
ఇతర హోటళ్లు, స్టాల్స్‌తో పోలిస్తే అతి తక్కువ ధరకే ఆహారం లభిస్తుండడంతో ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది.
ఉడాన్ యాత్రి కేఫ్‌కు ప్రయాణికుల నుంచి చక్కటి స్పందన లభించడంతో పౌర విమానయాన శాఖ దేశంలోని మిగతా ఎయిర్‌పోర్టుల్లో యుడాన్ కేఫ్‌ను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది.