Bhogi Muggulu With Dots 2025: భోగి పండగ సందర్భంగా మీ ఇంటి ముందు చక్కటి ముగ్గులు వేయాలనుకుంటున్నారా? అయితే మీకోసం ఈ కొత్త ఏడాది డిజైన్స్ రానే వచ్చాయి. ప్రత్యేకమైన డిజైన్స్తో కూడిన కొత్త కొత్త డిజైన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఇదిలా ఉంటే చాలామంది ఈ సమయంలో ఎక్కువగా చుక్కల ముగ్గులు వేసేందుకు ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం కూడా మీ ఇంటి ముందు సులభంగా భోగి పండుగకు సంబంధించిన ప్రత్యేకమైన థీమ్స్ తో కూడిన ముగ్గులను ఇలా వేయండి.
మరి కొంతమంది అయితే భోగి పండుగ రోజున కుండలో నుంచి పాలు పొంగడంకు సంబంధించిన థీమ్ ముగ్గులను కూడా వేస్తూ ఉంటారు. ఈ ముగ్గు వేయడం ఎంతో కష్టమైనప్పటికీ చాలామంది ఇష్టపడి మరీ వేస్తూ ఉంటారు.
చాలామందికి భోగి పండగ అంటే గుర్తొచ్చేది దాన్యంతో కూడిన కుండలు, చెరకు గడలు. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది పండగ రోజున ధాన్యంతో కూడిన కుండలకు సంబంధించిన ముగ్గులను ఇంటిముందు వాకిట్లో వేస్తూ ఉంటారు. ఇవి కూడా ఎంతో ఆకర్షణీయంగా నిలుస్తాయి.
కొంతమంది అయితే నాలుగు పాల కుండలతో కూడిన ప్రత్యేకమైన డిజైన్ కలిగిన ముగ్గు వేసుకుంటూ ఉంటారు. ఈ ముగ్గు చాలా అద్భుతంగా కనిపిస్తుంది. అంతేకాకుండా మధ్యలో ఒక చిన్న పువ్వు డిజైన్తో చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
మరి కొంతమంది అయితే హ్యాపీ భోగి అని ప్రత్యేకమైన థీమ్ కూడిన ముగ్గు కూడా వేస్తూ ఉంటారు. ఇందులో భోగి మంటలను కాల్చుతూ.. ప్రత్యేకమైన డిజైన్తో కూడిన ముగ్గు వేస్తూ ఉంటారు. అయితే ఈ పండగ వేళ మీరు కూడా మీ ఇంటి ముందు వేసుకోండి.
ఇక కొంతమంది అయితే నెమలి డిజైన్‌తో కూడిన ప్రత్యేకమైన ముగ్గును కూడా వేస్తూ ఉంటారు. ఈ ముగ్గు చాలా ఆకర్షణీయంగా కనిపించేందుకు ప్రత్యేకమైన చెరుకు గడలు, పాలకొండలను అదనంగా జోడించి ము ఈ ముగ్గు వేస్తారు.
భోగి సందర్భంగా అందరి ఇంటి ముందు కనబడే ముగ్గు ఒకే ఒకటి అదేంటో కాదు.. పాలు పొంగుతున్న ప్రత్యేకమైన థీమ్ కూడిన ముగ్గు.. ఈ ముగ్గు వేయడం ఎంతో సులభం. ఈ భోగి సందర్భంగా మీ ఇంటి ముందు కూడా చాలా చక్కగా ఆకర్షణీయంగా కనిపించేందుకు ఈ ముగ్గు ట్రై చేయండి.