Herbal Drinks: ఇటీవలి కాలంలో యూరిక్ యాసిడ్ ప్రధాన సమస్యగా మారింది. చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి కారణంగా ఈ సమస్య అధికమౌతోంది. యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగితే కీళ్ల నొప్పులు, స్వెల్లింగ్, క్రాంప్స్ వంటి వ్యాధులు ఉత్పన్నమౌతాయి.
Herbal Drinks: అయితే కొన్ని హెర్బల్ డ్రింక్స్ ద్వారా యూరిక్ యాసిడ్ సమస్యు సులభంగా నియంత్రించవచ్చు. ఆయుర్వేదంలో హెర్బల్ డ్రింక్స్‌కు చాలా ప్రాధాన్యత ఉంది. అలాంటి 5 హెర్బల్ డ్రింక్స్ గురించి తెలుసుకుందాం.
గిలోయ్ టీ గిలోయ్ అనేది బెస్ట్ మెడిసిన్. శరీరం నుంచి వ్యర్ధాలను బయటకు తొలగించడంలో అద్భుతంగా ఉపయోగపడుతుంది. గిలోయ్ టీ తాగడం వల్ల యూరిక్ యాసిడ్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కల్గిస్తుంది.
త్రిఫలం టీ ఆయుర్వేదం ప్రకారం త్రిఫల చూర్ణానికి చాలా ప్రాధాన్యత ఉంది. శరీరాన్ని డీటాక్స్ చేసేందుకు ఉపయోగపడుతుంది. యూరిక్ యాసిడ్ నియంత్రిస్తుంది. త్రిఫల చూర్ణాన్ని వేడి నీళ్లలో కలిపి తాగితే మంచిది
పునర్వవ హెర్బల్ టీ పునర్వవ అనేది ఓ శక్తివంతమైన మూలిక. కిడ్నీ ఆరోగ్యం కోసం ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. శరీరంలోని అదనపు యూరిక్ యాసిడ్ తొలగించడంతో దోహదం చేస్తుంది. పునర్వన ఆకుల్ని నీళ్లలో మరిగించి తాగవచ్చు లేదా పౌడర్ నీళ్లో కలిపి తాగవచ్చు
ధనియా నీళ్లు ధనియా నీళ్లలో డై యురేటిక్ గుణాలు అధికం. ఇవి కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతాయి. శరీరం నుంచి అదనపు యూరిక్ యాసిడ్ బయటకు తొలగిస్తుంది. రాత్రంతా ఓ గ్లాసు నీళ్లలో నానబెట్టి ఉదయం తాగాలి
వేప, తులసి వేప, తులసి రెండింటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు చాలా ఎక్కువ. శరీరంలోని వ్యర్ధాలను బయటకు తొలగిస్తుంది. యూరిక్ యాసిడ్ క్రిస్టల్‌గా మారకుండా నియంత్రిస్తుంది. క్రాంప్స్ ముప్పు తగ్గుతుంది. ఈ రెండింటి ఆకుల్ని నీళ్లలో మరిగించి రాత్రంతా ఉంచి ఉదయం తాగాలి