Balakrishna Old Titles: తెలుగు సినిమా ఇండస్ట్రీలో పాత బ్లాక్ బస్టర్ హిట్ టైటిల్స్ ను రిపీట్ చేయడం ఎప్పటి నుంచో ఉంది. తాజాగా శర్వానంద్ తన కొత్త చిత్రానికి బాలయ్య బ్లాక్ బస్టర్ ‘నారీ నారీ నడుమ మురారి’ అనే పెట్టడంతో ఒక్కసారి ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయింది. ఇక గతంలో తెలుగులో బాలయ్య నటించిన పాత సినిమా టైటిల్స్ తో తెరకెక్కిన సినిమాల విషయానికొస్తే..
నారీ నారీ నడుమ మురారి.. నందమూరి బాలకృష్ణ ఎలాంటి యాక్షన్ సన్నివేశాలు, మాస్ అంశాలు లేకుండా ఇద్దరు హీరోయిన్స్ మధ్య నలిగే హీరోగా నటించిన చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’. తాజాగా ఈ టైటిల్ తో శర్వానంద్ త్వరలో పలకరించబోతున్నారు. సంక్రాంతి పండగ సందర్భంగా ఈ సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.
‘సుల్తాన్’.. నట సింహా గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం ‘సుల్తాన్’. ఈ మూవీ టైటిల్‌తో ఆ తర్వాత కార్తి హీరోగా మరో సినిమా వచ్చింది. ఈ చిత్రం పెద్దగా మెప్పించలేకపోయింది.
అశ్వమేథం.. నందమూరి బాలకృష్ణ, శోభన్ బాలు హీరోలుగా కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ లో తెరకెక్కిన భారీ చిత్రం ‘అశ్వమేథం’. అప్పట్లో భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం ఆడియన్స్ ను మెప్పించలేకపోయింది. ఆ తర్వాత ఎన్నో ఏళ్లకు అదే టైటిల్ ‘అశ్వమేథం’తో సినిమా వచ్చింది. కానీ ఈ చిత్రం కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
బంగారు బుల్లోడు.. బాలకృష్ణ పాత బ్లాక్ బస్టర్స్ మూవీస్ లో ‘బంగారు బుల్లోడు’ ఒకడు. ఈ టైటిల్‌తో అల్లరి నరేష్ ఓ సినిమా చేసాడు. ఈ ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది.
కథానాయకుడు.. నందమూరి బాలకృష్ణ హీరోగా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో కే.మురళీ మోహన్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కథానాయకుడు’. ఆ తర్వాత చాలా యేళ్లకు రజినీకాంత్ ఇదే టైటిల్ తో సినిమా చేసి బాక్సాఫీస్ దగ్గర పెద్దగా మెప్పించలేకపోయారు. ఇక కథానాయకుడు టైటిల్ తో అన్న ఎన్టీఆర్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే కదా.