Daaku Maharaaj OTT Streaming Date: ‘డాకు మహారాజ్’ ఓటీటీ రిలీజ్ డేట్ లాక్.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..

Daaku Maharaaj OTT Streaming Date: టాలీవుడ్ సీనియర్ టాప్ స్టార్స్ లో  బాలయ్య మంచి దూకుడు మీదున్నారు.  వరుసగా ‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’ సినిమాల  తర్వాత తాజాగా ‘డాగు మహారాజ్’ మూవీతో వరుసగా నాల్గో సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా బాక్సాఫీస్ మంచి వసూళ్లతో దూసుకుపోతుంది. తాజాగా  ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది.

 

1 /6

Daaku Maharaaj OTT Streaming Date:  సీనియర్ టాప్ స్టార్స్ లో  బాలకృష్ణ వరుస హిట్లతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. అంతేకాదు వరుస విజయాలతో జైత్రయాత్ర చేస్తున్నాడు. తాజాగా ‘డాకు మహారాజ్’ మూవీతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.  

2 /6

‘డాకు మహారాజ్’ మూవీ నాలుగు రోజుల్లో రూ. 100 కోట్ల క్లబ్బుల్లో ప్రవేశించింది. అంతేకాదు 5 రోజుల్లో రూ. 114 కోట్ల గ్రాస్ క్లబ్ తో పాటు రూ 70 కోట్ల షేర్ తో బాక్సాఫీస్ దగ్గర స్టడీ గా కలెక్షన్స్ రాబడుతోంది. మరో రూ. 10 కోట్ల షేర్ తో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని లాభాల్లో రానుంది.

3 /6

‘డాకు మహారాజ్’ మూవీ బాలయ్యకు సోలో హీరోగా నాల్గో రూ.100 కోట్ల సినిమా. అఖండతో ఫస్ట్ టైమ్ రూ. 100 కోట్ల గ్రాస్ క్లబ్బులో ప్రవేశించిన ఈ చిత్రం.. ఆ తర్వాత వీరసింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’, తాజాగా ‘డాకు మహారాజ్’ మూవీలతో వరుసగా నాలుగు వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో ప్రవేశించిన హీరోగా రికార్డు క్రియేట్ చేసాడు. అంతేకాదు యూఎస్ లో వరుసగా నాలుగు వన్ మిలియన్ డాలర్స్ కొల్లగొట్టిన సీనియర్ కథానాయకుడిగా రికార్డు క్రియేట్ చేసారు.

4 /6

ఇక బాలకృష్ణ   60 యేళ్ల పై బడిన వయసులో  వరుసగా నాలుగు వరుస సక్సెస్ లు అందుకోవడంతో కంటిన్యూగా  నాలుగు రూ. 100 కోట్ల గ్రాస్ అందుకున్నసీనియర్ టాప్ స్టార్  గా రికార్డు క్రియేట్ చేసారు. ఈ రేంజ్ సక్సెస్ రేట్ ఉన్న సీనియర్ స్టార్  భారత దేశంలో ఎవరు లేరు. ఒక రకంగా బాలయ్య ‘డాకు మహారాజ్’ తో ప్రపంచ రికార్డు క్రియేట్ చేసారు.  

5 /6

తాజాగా ‘డాకు మహారాజ్’ మూవీకి సంబంధించిన ఓటీటీ హక్కులను దాదాపు రూ. 50 కోట్లకు  నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. ఈ సినిమా  ఫిబ్రవరి 5 నుంచి నెట్ ఫ్లిక్స్ లో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కు రానుంది.

6 /6

టాలీవుడ్ లో  బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ‘డాకు మహారాజ్’ చిత్రం తాజాగా తమిళంలో నేడు విడుదలై మంచి వసూళ్లనే రాబడుతోంది. అంతేకాదు మరో వారంలో హిందీలో కూడా రిలీజ్ చేయాలనే ప్లాన్ లో ఉన్నారు. మరి ఇతర భాషల్లో ఈ సినిమా ఏ మేరకు వసూళ్లను రాబడుతుందో చూడాలి మరి.