Wedding Dates: లగ్న బలం అంటే ఇది.. డిసెంబర్ నెలలో అద్భుతమైన పెళ్లి మూహుర్తాలు ఇవే.. డోంట్ మిస్ అంటున్న పండితులు..

December month wedding muhurat: డిసెంబరు నెల ప్రారంభమైంది. అయితే.. ఈ మాసంలో లగ్నబలం బాగా ఉందని తెలుస్తొంది. అందుకే వేలాది జంటలు ఈ మాసంలో పెళ్లి బంధంతో ఒక్కటవ్వనున్నట్లు సమాచారం. 

1 /6

సాధారణంగా  యువతీ, యువకుల తల్లిదండ్రులు తమ పిల్లల పెళ్లిళ్లకు మంచి మూహుర్తాలు చూస్తుంటారు. పెళ్లిచేయబోయే మూహుర్తం మీద వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని చెప్పుకొవచ్చు. కొంత మంది లైఫ్ అప్పటి వరకు నార్మల్ గా ఉన్న కూడా.. పెళ్లి తర్వాత వారి జీవితంలో గొప్ప మార్పులు సంభవిస్తుంటాయి.

2 /6

అందుకే కోడలు వచ్చిన వేళ విశేషం అని చాలా మంది తరచుగా అంటుంటారు. అందుకే మంచి మూహుర్తం చూసి.. తమ కూతురును అత్తరింటికి పంపేందుకు లేదా..  మరో ఇంట బిడ్డను తమ ఇంటికి కోడలిగా తెచ్చుకునేందుకు కూడా మంచి మూహుర్తం కోసం తెగ ప్రయత్నాలు చేస్తుంటారు.

3 /6

ప్రస్తుతం ఈ ఏడాది ఎండింగ్ కు వచ్చిందని చెప్పుకొవచ్చు.  ఇక.. డిసెంబర్ మాసం స్టార్ట్ అయ్యింది.  డిసెంబర్‌లో పెళ్లిళ్లకు భారీగా శుభ ముహూర్తాలు ఉన్నాయని పురోహితులు తెలిపారు. ఈ నేపథ్యంలో.. ఇప్పటికే పెళ్లిళ్లకు చాలా మంది రెడీ అయిపోయినట్లు తెలుస్తొంది.

4 /6

ఈ నెలలోనే శోభిత చైతుల పెళ్లి డిసెంబర్ 4, కీర్తీ సురేష్ పెళ్లి 11న జరుగనున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. డిసెంబరు నెలలో .. 4, 5, 6, 7, 10, 11, 14, 20, 22, 24, 25 తేదీల్లో శుభ ముహూర్తాలు ఉన్నాయని పండితులు వెల్లడించారు.   

5 /6

అదే విధంగా.. జనవరిలో మంచి ముహూర్తాలు లేవు. ఆ తర్వాత మరల... జనవరి 31 నుంచి మార్చి 4 వరకు మాఘ మాసంలో శుభ కార్యాలకు ముహూర్తాలు ఉన్నట్లు తెలుస్తొంది. దీంతో క్యాటరింగ్ పండితులు, ఫోటోగ్రాఫర్స్, వీడియోలు,  స్టేజీ డెకోరేషన్, బ్యాండ్, సన్నాయి.. మొదలైన వారికి ఫుల్ డిమాండ్ ఉందని కూడా చెప్పుకొవచ్చు.  

6 /6

సాధారణంగా కొంతమంది ఎంత ప్రయత్నించిన పెళ్లిళ్లు కుదరక తెగ బాధలు పడుతుంటారు. ఇలాంటి వారు రాహు ,కేతు దోషపరిహారాలు, మోపిదేవీ ఆలయంకు వెళ్లి సర్పవిగ్రహాంలను ప్రతిష్టాపన చేయించుకొవాలి. నాసిక్ త్రయంబకేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేయించుకొవాలని పండితులు చెబుతున్నారు.