Anushka: సీరియల్లో అనుష్క శెట్టి.. ఆశ్చర్యపోతున్న స్వీటీ అభిమానులు

Anushka Shetty in Serial: అనుష్క శెట్టి తెలుగు ఇండస్ట్రీలో ఎంతమంది అభిమానులు ఉన్నారో తెలిసిన విషయమే. అరుంధతి సినిమా ద్వారా స్టార్ హీరోలు అంత క్రేజ్ సంపాదించుకుంది ఈ హీరోయిన్. అయితే ఈ హీరోయిన్ ఒక సీరియల్ లో కూడా నటించింది. ప్రస్తుతం ఎందుకు సంబంధించిన వార్త ఆమె అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది.

1 /5

తెలుగు సినీ పరిశ్రమలో లేడీ సూపర్‌ స్టార్‌గా గుర్తింపు పొందిన అనుష్క శెట్టి, తన నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో ఆమె మంచి పేరు తెచ్చుకుంది. అయితే, అనుష్క ఓ సీరియల్‌లో కూడా నటించిందని చాలామందికి తెలియదు.    

2 /5

అనుష్క ‘యువ’ అనే టీవీ సీరియల్‌లో చిన్న పాత్రలో కనిపించింది. ఈ సీరియల్ 2007లో మా టీవీలో ప్రసారమైంది. ఇందులో రష్మి, కరాటే కళ్యాణి, వాసు, కృష్ణుడు వంటి నటీనటులు ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సీరియల్ మూడు జంటల మధ్య సాగే ప్రేమ కథ ఆధారంగా రూపొందించబడింది.

3 /5

‘యువ’ సీరియల్ తెరకెక్కడంలో ప్రముఖ దర్శకుడు రాజమౌళి, అక్కినేని నాగార్జున ప్రమేయం కూడా ఉండడం విశేషం. ఈ ప్రాజెక్ట్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో తెరకెక్కింది. దర్శకుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో ఇది రూపుదిద్దుకుంది. అనుష్క, నాగార్జున, రాజమౌళిల మధ్య ఉన్న మంచి అనుబంధం కారణంగా, స్వీటీ ఇందులో గెస్ట్ రోల్‌లో నటించడం జరిగింది.  

4 /5

ఈ సీరియల్‌లో అనుష్క ఒక ముఖ్యమైన పాత్రలో మెరిసింది. ఆమె వాసు అనే పాత్రకి లవర్‌గా నాగలక్ష్మిగా కొద్దిసేపు కనిపిస్తుంది. కేఫ్‌లో సన్నివేశంలో అనుష్క ఎంట్రీ ఇవ్వగా, అక్కడ ఉన్న అమ్మాయిలు అందరూ ఆమెను చూసి జలసి ఫీల్ అవుతారు. ఇక ఎందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు వైరల్ అవుతూ అందరిని ఆశ్చర్యపరచడమే కాకుండా ఆకట్టుకుంటున్నాయి.

5 /5

ఇటీవల, అనుష్క ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ చిత్రంలో నటించింది. ఇప్పుడు ఆమె ‘ఘాటి’ అనే క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌లో నటిస్తోంది. ఈ చిత్రం ద్వారా అనుష్క కొత్త తరహా పాత్రలో కనిపించనుంది.