WaterMelon: మార్కెట్‌లో పుచ్చకాయల్ని కొంటున్నారా..?.. మంచిదా.. లేకుంటే కల్తీదా..?.. ఈ చిన్న టెక్నిక్‌తో గుర్తించవచ్చు..

Adulteration of watermelon: చాలా మంది సమ్మర్ వచ్చింటే పుచ్చకాయల్ని ఎంతో ఇష్టంతో తింటారు. అయితే వాటర్ మిలన్ లలో రకరకాల రసాయలను మిక్స్ చేసి అవి ఎర్రగా కన్పించేలా చేస్తున్నారు.
 

1 /6

సమ్మర్ రాగానే చాలా మంది పుచ్చకాయల్ని ఎక్కువగా ఇష్టంతో తింటారు. అంతే కాకుండా.. పుచ్చకాయలలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. డాక్టర్ లు కూడా సమ్మర్ లో పుచ్చకాయల్ని తినాలని సలహా ఇస్తుంటారు.  

2 /6

అయితే.. ఇటీవల మాత్రం కాదేదీ కల్తీలకు అనర్హం అన్న విధంగా మారిపోయింది. ప్రతి దాంట్లో కల్తీ జరిగిపోతుంది. మనిషి నిత్య జీవితంలో ఉపయోగించేవాటిని అన్నింటిని కూడా కల్తీలు చేస్తున్నారు.  

3 /6

కల్తీ పదార్థాలు కల్గి ఉన్నవి తినడం వల్ల అనేక హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అయితే. వాటర్ మిలన్ ను కల్లీదా..?.. కాదా..?.. అన్నదాన్ని ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందాం.  దీని కోసం.. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(FSSAI)  కల్తీ పుచ్చకాయను ఎలా కనిపెట్టాలో సూచించింది.

4 /6

పుచ్చకాయల్ని అమ్మేటప్పుడు చాలా చోట్ల కట్ చేసి అమ్ముతుంటారు. అలాంటి చోట్ల వాటర్ మిలన్ ఒక దూదితో కాస్తంతా రుద్ది చూడాలి. ఒక వేళ దూది ఎర్రగా మారితే.. అది రసాయనాలు కల్పిన వాటర్ మిలన్ అని గుర్తించాలి. కానీ రంగు మారకుండా.. ఉండే దానిలో ఎలాంటి కల్తీలేదని అర్థం.

5 /6

చాలా చోట్ల వాటర్ మిలన్ కు ఎర్రటి రంగు వచ్చేందుకు.. ఎరిథ్రోసిన్‌ను E127 ను కలుపుతారు. దీని వల్ల శరీరంలోని అనేక ఇబ్బందులు తలెత్తుటాయి. వీటిని పుచ్చకాయలో ఇంజెక్ట్ చేస్తారు. ఇది జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది.

6 /6

ఎరిథ్రోసిన్ క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన ప్రభావంను కూడా కల్గిస్తుంది. దీని వల్ల వాంతులు, విరేచనాలు, తలనొప్పి, తలతిరగడం వంటి సమస్యలు కూడా కల్గుతాయి. అందుకే ఈ సింపుల్ టెక్నిక్ పాటించాలని నిపుణులు చెబుతున్నారు.