Allu Arjun: రాజకీయ ప్రవేశంపై అల్లు అర్జున్‌ సంచలన ప్రకటన.. షేకవుతున్న ఏపీ

Allu Arjun Team Condemn Prashant Kishor Political Comments: పుష్ప 2: ది రూల్‌ విజయంతో ప్రపంచవ్యాప్తంగా భారీ హిట్‌ పొందిన ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ సంచలన ప్రకటన చేశారు. రాజకీయాల్లోకి వస్తున్నారనే వార్తలు గుప్పున రావడంతో అల్లు అర్జున్‌ టీమ్‌ స్పందించింది. రాజకీయాల్లోకి వచ్చేది రానిదానిపై కీలక ప్రకటన చేసింది. వాళ్లు ఏం చెప్పారో తెలుసుకుందాం.

1 /6

భారీ హిట్‌: సుకుమార్‌ దర్శకత్వంలో పుష్ప 2తో వచ్చిన అల్లు అర్జున్‌ తన కెరీర్‌లో మరో సంచలన విజయాన్ని నమోదు చేసుకున్నాడు.

2 /6

అనూహ్య సంఘటనలు: పుష్ప 2 విడుదల సందర్భంగా కొన్ని అనూహ్య సంఘటనలు చోటుచేసుకోవడంతో అల్లు అర్జున్‌ ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.

3 /6

రాజకీయ ప్రవేశం: ఇదే సమయంలో రాజకీయాల్లోకి వస్తున్నారని బన్నీ విషయమై వార్తలు వచ్చాయి. ప్రశాంత్‌ కిశోర్‌ అనే వ్యక్తి ఈ వ్యాఖ్యలు చేయడంతో తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది.

4 /6

పీకే వ్యాఖ్యలు: ప్రశాంత్‌ కిశోర్‌ చేసిన వ్యాఖ్యలపై అల్లు అర్జున్‌ నేరుగా స్పందించలేదు. కానీ తన టీమ్‌ ద్వారా బన్నీ ఓ ప్రకటన విడుదల చేయించాడు.

5 /6

బన్నీ టీమ్‌: 'అల్లు అర్జున్‌పై తాజాగా వస్తున్న పుకార్లు పూర్తిగా నిరాధారం.. అవాస్తవం. ఇలాంటి అసత్య ప్రచారాన్ని మీడియా సంస్థలు ప్రసారం చేయకూడదు. ఏమైనా ప్రకటనలు ఉంటే అల్లు అర్జున్‌ అధికారిక సోషల్‌ మీడియా ద్వారా ప్రకటిస్తారు' అని అల్లు అర్జున్‌ టీమ్‌ పేర్కొంది.

6 /6

కొరవడిన స్పష్టత: వార్తలు అవాస్తవమని ప్రకటించినా కూడా ప్రశాంత్‌ కిశోర్‌తో సమావేశమయ్యారా లేదా? అనేది అల్లు అర్జున్‌ టీమ్‌ స్పష్టత ఇవ్వలేదు.