Pushpa 2 Disaster: ఆ రెండు చోట్ల తగ్గిన పుష్ప రాజ్.. బ్రేక్ ఈవెన్ ఆమడ దూరంలో ‘పుష్ప 2’..

Pushpa 2 Disaster: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘పుష్ప 2’. సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని రికార్డులు బ్రేక్ చేస్తూ తక్కువ టైమ్ లో వెయ్యి కోట్ల క్లబ్బులో ప్రవేశించింది. మరోవైపు ఈ సినిమా తెలుగు, హిందీలో ఇరగదీస్తోంది. ఎక్కడా తగ్గేదేలే అంటూ దూసుకుపోతున్న ఈ సినిమా ఆ రెండు రాష్ట్రాల్లో తగ్గింది. అంతేకాదు అక్కడ డిజాస్టర్ గా నిలిచింది. ఇక కోలుకునే స్థితి కనిపించడం లేదు.

1 /7

Pushpa 2 Disaster: సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కిన సినిమా ‘పుష్ప 2’. వీళ్లిద్దరి  కాంబినేషన్ లో వచ్చిన నాల్గో చిత్రం ‘పుష్ప 2’. పుష్ప 1 ది రైజ్’ చిత్రం ఫస్ట్ టైమ్  ప్యాన్ ఇండియా సక్సెస్ అందుకున్నాడు. అంతేకాదు ఈ సినిమా హిందీ బెల్ట్ లో రికార్డుల మోత మోగిస్తోంది.    

2 /7

అంతేకాదు హిందీలో తొలి రోజు నుంచే అన్ని రికార్డులను బ్రేక్ చేస్తూ దూసుకుపోతుంది. ముఖ్యంగా అక్కడ ఫస్ట్ డే రూ. 72 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. అప్పటి వరకు జవాన్ అత్యధికంగా రూ. 64 కోట్ల రికార్డును బ్రేక్ చేసింది. అంతేకాదు తక్కువ సమయంలోనే ఈ సినిమా రూ. 400 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టి ఔరా అనిపించింది.

3 /7

ముఖ్యంగా హిందీ ప్రేక్షకులు పుష్ప 2 సినిమాను నెత్తిన పెట్టుకున్నారు. నార్త్ బెల్ట్ లో పుష్ప 2 హిట్ కావడం అక్కడ వసూళ్ల ప్రభంజం కురింపచడం వంటి కారణాల వల్ల ఈ సినిమా తక్కువ టైమ్ లోనే రూ. 1000 కోట్ల క్లబ్బులో ప్రవేశించింది. ఈ రోజు వసూళ్లతో పుష్ప 2 హిందీలో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకునే అవకాశాలున్నాయి.

4 /7

అయితే.. తెలుగులో కూడా ఈ సినిమాను ఎక్కువ రేటుకు అమ్మారు. తెలుగులో బ్రేక్ ఈవెన్ కు రూ. 60 కోట్లకు పైగా రాబట్లాల్సి ఉంది. మరోవైపు ఈ సినిమా కర్ణాటకలో మాత్రమే బ్రేక్ ఈవెన్ సాధించింది. మరోవైపు ఈ సినిమా తమిళనాడు, కేరళలో డిజాస్టర్ గా నిలిచింది.  కేరళలో రూ. 20 కోట్లకు అమ్మిన ఈ సినిమా ఇప్పటి వరకు రూ. 6.50 కోట్ల వరకే రాబట్టింది. ఇకపై రాబడుతున్న ఆశా లేదు.

5 /7

ముఖ్యంగా కేరళ ప్రేక్షకులు పుష్ప 2పై గుర్రుగా ఉన్నారు. తమ హీరోపై అల్లు అర్జున్.. చుచ్చు పోయడం వంటివి వారి ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసినట్టు తెలుస్తోంది. అందుకే అక్కడ ప్రేక్షకులు ఈ సినిమాను తిరస్కరించినట్టు తెలుస్తుంది. 

6 /7

మరోవైపు తమిళనాడులో పుష్ప 2ను రికార్డు స్థాయిలో రూ. 52 కోట్లకు అమ్మారు. ఇప్పటి వరకు వచ్చింది రూ. 24 కోట్లు మాత్రమే. సగం కూడా రికవరీ కాలేదు. రాబోయే రోజుల్లో పుష్ప 2 అక్కడ నడిచే పరిస్థితులు లేవు. దీంతో తమిళం, కేరళల్లో పుష్ప 2 తగ్గాడు. అక్కడ డిజాస్టర్ గా నిలిచింది.

7 /7

ఓవరాల్ గా పుష్ప 2 సినిమా ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ కు రూ. 110 కోట్ల దూరంలో ఉంది. హిందీ, తెలుగులో వచ్చే వసూళ్లతో మొత్తంగా అక్కడ పుష్ప 2 సినిమా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకునే అవకాశాలున్నాయి. కానీ లాభాలు మాత్రం కేవలం హిందీలో మాత్రమే వచ్చే అవకాశాలున్నాయి.