New Income Tax Bill: లోక్‌సభలో కొత్త ట్యాక్స్‌ బిల్లు ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్‌.. కీలక వివరాలు ఇవే!

Tax Year in New Income Tax Bill: పార్లమెంట్ ముందుకు కొత్త ఆదాయపుపన్ను బిల్లు వచ్చేసింది. నూతన బిల్లును కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. దీనిలో కొన్ని మార్పులు, చేర్పులు ఉన్నాయి. అవేంటో చూద్దాం.  
 

1 /7

New Income Tax Bill 2025: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోకసభలో కొత్త ఆదాయపు పన్ను బిల్లును ప్రవేశపెట్టారు. గత వారం కేంద్ర ప్రభుత్వ మంత్రివర్గం ఆమోదం పొందిన తర్వాత నేడు అనగా గురువారం నాడు నిర్మలా సీతారామన్ సభ ముందుకు ఈ బిల్లును తీసుకువచ్చారు. లోకసభలో విపక్షాల నిరసనల మధ్య ఆర్థిక మంత్రి బిల్లును సభలో ప్రవేశపెట్టారు. విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి. కాసేపటికి లోకసభ మార్చి 10వ తేదీకి వాయిదా పడింది. కొత్త ఆదాయపు పన్ను బిల్లు ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి వస్తుందని అంతా భావిస్తున్నారు. 

2 /7

ప్రస్తుతం దశాబ్దాల నాటి ఆదాయపు పన్ను చట్టం అమల్లో ఉంది. దీని స్థానంలో కొత్త చట్టం తీసుకువస్తుంది. ఇందులో భాగంగానే పార్లమెంట్ ముందు ప్రవేశపెట్టారు. 1961లో రూపొందించిన ఆదాయపుపన్ను చట్టంలో ఇప్పటి వరకు ఎన్నో సవరణలు జరిగాయి

3 /7

 ఈ చట్టాన్ని సమీక్షించి సులభతరం చేస్తామని గతంలో ఎన్డీఏ ప్రభుత్వం తెలిపింది. ఇందుకోసం కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి అంతర్గత కమిటీని కూడా ఏర్పాటు చేసింది. చట్ట సమీక్షకు 22 సబ్  కమిటీలను కూడా ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఈ బిల్లుపై మరింత చర్చ కోసం లోకసభ సెలక్ట్ కమిటీకి పంపిస్తారు.   

4 /7

కొత్త బిల్లులో 536 విభాగాలు, 23 అధ్యాయాలు, 16 షెడ్యూల్ లు ఉండగా... ఇందులో కొత్త పన్ను విధించే ప్రస్తావన లేదు. ఈ బిల్లు ప్రస్తుత ఆదాయపు పన్ను చట్టం 1961 భాషను సులభతరం చేస్తుంది. కొత్త చట్టం 2026 ఏప్రిల్ 1 న  అమల్లోకి వస్తుంది. చట్టం నోటిఫై అయిన తర్వాత నియమ నిబంధనలను అమల్లోకి వస్తాయి.

5 /7

ప్రస్తుతం ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు అసెస్ మెంట్ ఇయర్ గా ఉంది. కొత్త బిల్లులో ట్యాక్స్ ఇయర్ గా మార్చారు. అంటే మునుపటి ఏడాది ప్రీవియస్ ఇయర్, అంచనా సంవత్సరం అసెస్ మెంట్ ఇయర్ వంటి కష్టమైన పదాలను కొత్త బిల్లులో నుంచి తొలగించారు. పన్ను ఏడాది అంటే ట్యాక్స్ ఇయర్ అనే పదంతో సరిపెట్టారు.   

6 /7

పన్ను చెల్లింపుదారులు హక్కులు, బాధ్యతలు వివరించే పన్ను చెల్లింపుదారుల చార్టర్ ను బిల్లులో చేర్చారు. ఫార్ములాలు పొందుపరిచారు. జీతాల్లో స్టాండర్డ్ డిడక్షన్, గ్రాట్యుటీ లీవ్ ఎన్ క్యాష్ మెంట్ వంటి తగ్గింపులన్నీ ఒకే చోట ఉంటాయి. గతంలో పలు సెక్షన్లు, రకరకాల నిబంధనల్లో ఇవి ఉంటుండేవి.   

7 /7

వ్యక్తులు హిందూ అవిభాజ్య కుటుంబాలు, ఇతరుల కోసం కొత్త, పాత ఆదాయ పన్ను విధానాలకు వర్తించేలా చట్టం ఉంటుంది. ప్రస్తుత చట్టంలో చాలాసార్లు కనిపించే నాట్ విత్ స్టాండింగ్ అనే పదం స్థానంలో ఇర్రెస్పెక్టివ్ అనే పదాన్ని చేర్పించారు.