Keerthy Suresh marriage: మహానటి కీర్తి సురేష్ టాలీవుడ్ లో భారీ పాపులారిటీ సంపాదించుకొని, ఇప్పుడు పెళ్లికి సిద్ధమవుతోంది అంటూ ఒక వార్త తెరపైకి వచ్చింది. పెళ్ళికొడుకు అతడే అని , అయితే డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకోబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి.. నేను శైలజ అనే సినిమాతో అడుగుపెట్టి, మొదటి సినిమాతోనే భారీ పాపులారిటీ సంపాదించుకున్న కీర్తి సురేష్ గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. ఆ తర్వాత నేను లోకల్ , అజ్ఞాతవాసి వంటి చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతేకాదు తమిళంలో ఈమె నటించిన రెమో చిత్రం తెలుగులో కూడా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.
ఇక ఈ సినిమా తర్వాత ప్రముఖ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మహానటి సినిమా చేసి ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. అంతేకాదు ఈ సినిమాతో ఏకంగా ఉత్తమ నటి విభాగంలో జాతీయ అవార్డు కూడా లభించింది. ఈ సినిమా తర్వాత చాలామంది స్టార్ హీరోలతో నటించి సాంప్రదాయానికి నిలువుటద్దంగా మారిన కీర్తి సురేష్, ఆ తర్వాత మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాలో గ్లామర్ గా నటించి హద్దులు చెరిపేసింది.
ఇక ఈ సినిమాతో గ్లామర్ గర్ల్ గా మారిపోయిన ఈమె, ఆ తర్వాత భోళాశంకర్ సినిమాలో చిరంజీవికి చెల్లిగా నటించింది. అంతేకాదు పలువురు సీనియర్ స్టార్ హీరోల సినిమాలలో సిస్టర్ క్యారెక్టర్ పోషించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు పలు చిత్రాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైన ఈమె త్వరలో పెళ్లి చేసుకోబోతోంది అంటూ ఒక వార్త తెరపైకి వచ్చింది.
ముఖ్యంగా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతోందని, గోవాలో పెళ్లికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం. అంతేకాదు కీర్తి సురేష్ వివాహం చేసుకోబోయే వ్యక్తి దగ్గరి బంధువు అని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు త్వరలోనే కీర్తి సురేష్ కుటుంబ సభ్యుల నుంచి ఈ విషయం అధికారికంగా వెల్లడి కానున్నట్లు తెలుస్తోంది.
ఇకపోతే ఈ విషయం తెలిసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన హీరోయిన్ పెళ్లి జరగబోతోంది అని తెలియడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే కీర్తి సురేష్ ప్రముఖ నిర్మాత జీ. సురేష్ కుమార్ , నటి మేనక ల కుమార్తె.