Honda Launch Honda Shine 100 CC Bike Under @ Rs 65 Thousand: ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్స్ (HMSI) భారత మార్కెట్లోకి అత్యంత చౌకైన బైక్‌ను విడుదల చేసింది. హీరో స్ల్పెండర్కు గట్టి పోటీనిచ్చేందుకు కంపెనీ 100సీసీ మోటార్‌సైకిల్‌ను రిలీజ్ చేసింది. ఆ బైక్ మరేదో కాదు 'హోండా షైన్ 100' (Honda Shine 100 CC). ఈ బైక్ ధరను కంపెనీ 65 వేల రూపాయల కంటే తక్కువగా ఉంచింది. కంపెనీకి చెందిన ఈ బైక్ 5 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. కంపెనీ ఈ బైక్ ప్రారంభ ధరను రూ.64,900 (ఎక్స్-షోరూమ్, మహారాష్ట్ర)గా నిర్ణయించింది.
Honda Shine 100 CC Price:
హోండా షైన్ 100 బైక్ పనితీరు దాదాపుగా హీరో స్ల్పెండర్ ప్లస్ మాదిరే ఉంటుంది. ఈ బైక్ 97.2 cc, ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజన్ ద్వారా శక్తిని ఇస్తుంది. ఈ బైక్ 8 Bhp శక్తిని మరియు 8.05 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. హోండా షైన్ 100 4-స్పీడ్ గేర్ బాక్స్‌తో వస్తుంది. హోండా యొక్క ఈ 100 సిసి బైక్.. స్ల్పెండర్తో పాటు హెచ్ఎఫ్ డీలక్స్, హెచ్ఎఫ్ 100 మరియు బజాజ్ ప్లాటినా 100లతో పోటీపడనుంది. వినియోగదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని.. సైడ్ స్టాండ్ ఉన్నప్పుడు ఇంజిన్ స్టార్ట్ కాదు. కొత్త 100 సిసి షైన్‌తో హోండా గ్రామీణ మార్కెట్లపై దృష్టి సారిస్తోంది.
Honda Shine 100 CC Mileage:
హోండా కొత్త షైన్ 100 సిసి అత్యుత్తమ మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. హోండా షైన్ 100పై 6 సంవత్సరాల ప్రత్యేక వారంటీ ప్యాకేజీ (3 సంవత్సరాల ప్రామాణిక + 3 సంవత్సరాల ఐచ్ఛిక పొడిగించిన వారంటీ) కూడా అందించబడుతోంది. ఈ బైక్ డిజైన్ చాలా బాగుంది. ఇది ఆకర్షణీయమైన ఫ్రంట్ కౌల్, అన్ని బ్లాక్ అల్లాయ్ వీల్స్, ప్రాక్టికల్ అల్యూమినియం గ్రాబ్ రైల్, బోల్డ్ టెయిల్ ల్యాంప్ కలిగి ఉంటుంది. కొత్త హోండా షైన్ 100లో 677 మిమీ పొడవాటి సీటు మరియు సీట్ ఎత్తు 786 మిమీగా ఉంటుంది.
Honda Shine 100 CC Bookings:
హోండా షైన్ 100 బైక్ బుకింగ్ నేటి నుంచే ప్రారంభమయ్యాయి. వచ్చే నెల నుంచి ఉత్పత్తి ప్రారంభమవుతుంది. ఇక డెలివరీ మే 2023 నుండి ప్రారంభమవుతుంది. భారతదేశంలోని మొత్తం మోటార్‌సైకిళ్ల విక్రయాల్లో 100సీసీ మోటార్‌సైకిల్ విభాగం వాటా 33%గా ఉంది. ఈ 33%లో ఎక్కువ భాగం హీరో మోటోకార్ప్ బైక్స్ ఉన్నాయి. స్ల్పెండర్ నెలవారీ అమ్మకాలు దాదాపు 2.5 లక్షల యూనిట్లు. ఇప్పటివరకు ఈ సెగ్మెంట్లో హోండా లేదు. అయితే ఇప్పుడు పోటీ పెరగడం ఖాయం అని కంపెనీ విశ్వసిస్తోంది.
Also Read: New India Captain: అదే జరిగితే భారత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యానే.. సునీల్ గవాస్కర్ జోస్యం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి