Weight Loss Diet: బరువు తగ్గే క్రమంలో పొరపాటు ఈ ఆహారాలు తింటే మొదటికే మోసం!

  Weight Loss Mistakes: ప్రస్తుతం చాలా మంది బరువు తగ్గే క్రమంలో డైట్‌లను అనుసరిస్తున్నారు. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా తీసుకునే ఆహారంలో పలు రకాల జాగ్రత్తలు పాటించడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.    

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 25, 2023, 08:16 PM IST
Weight Loss Diet: బరువు తగ్గే క్రమంలో పొరపాటు ఈ ఆహారాలు తింటే మొదటికే మోసం!

Weight Loss Mistakes: బరువు తగ్గే క్రమంలో తప్పకుండా డైట్ పద్దతిని పాటించడం చాలా మంచిది. ఎందుకంటే డైట్‌లో తీసుకునే అన్ని ఆహారాలు ఆరోగ్యకరంగా ఉంటాయి. కాబట్టి సులభంగా శరీర బరువును తగ్గించడమేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. అయితే అధిక బరువు కారణంగా చాలా మంది తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దీని కారణంగా చాలా మంది  కార్డియోవాస్కులర్ రిస్క్, ఫ్యాటీ లివర్ వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో నిత్యం బాధపడేవారు తప్పకుండా పలు ఆహారాలు తీసుకోకపోవడం మంచిది. అయితే ఎలాంటి ఆహారాలు తీసుకోకపోవడం వల్ల సులభంగా బరువు తగ్గొచ్చో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

బరువు తగ్గే డైట్‌లో వీటిని అస్సలు తీసుకోవద్దు:
టీతో అల్పాహారం తీసుకోవడం:

టీ తాగడం మన జీవితంలో ఒక ముఖ్యమైన అవాటుగా మారింది. మనలో చాలా మంది టీ లేకుండా అస్సలు ఉండలేరు. అల్పాహారంతో పాటు టీ తాగడం చాలా మంది అలవాటు చేసుకున్నారు. ఇలా ప్రతి రోజు ఫాలో అవ్వడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. టీలో కెఫిన్ అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యల బారిన పడొచ్చని నిపుణులు చెబుతున్నారు.

అరటి పండుతో పాలు తాగడం:
చాలా మంది అరటిపండ్లు తిన్న వెంటనే పాలు కూడా తాగుతున్నారు. అయితే ఈ రెండింటిలో పోషకాలు ఎక్కువగా ఉన్నప్పటికీ, వీటిని కలిపి తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారు. కాబట్టి డైట్‌లో వీటిని తీసుకోకపోవడం చాలా మంచిదని నిపుణుతు చెబుతున్నారు.

భోజనం చేసిన వెంటనే స్వీట్లు తినడం:
డిన్నర్ చేసిన తర్వాత డెజర్ట్ తినడం ఆనవాయితిగా వస్తోంది. అయితే ఇలా తీసుకోవడం వల్ల  గుండెపై భారం పడుతుంది. కాబట్టి బరువు తగ్గే క్రమంలో స్వీట్లను తీసుకోవడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి బరువు తగ్గే డైట్‌లో స్వీట్లు తీసుకోకపోవడం చాలా మంచిది.

ప్రోటీన్ రిచ్‌ ఫుడ్స్‌:
ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం చాలా మంచిది. అయితే బరువు తగ్గే ఇవి ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకుంటే తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. అంతేకాకుండా బరువు తగ్గే క్రమంలో ఫలితాలు కూడా పొందకపోవచ్చు. కాబట్టి బరువు తగ్గే క్రమంలో ప్రోటీన్ రిచ్‌ ఫుడ్స్‌ తీసుకోవద్దు.

Also Read:  Medical Student Preethi Suicide: ప్రీతి చనిపోయిందా..? అడ్డంగా బుక్కైన పూనమ్ కౌర్..నెటిజన్లు ఫైర్

Also Read: Anchor Rashmi Gautam : రష్మీని కుక్కను కొట్టినట్టు కొట్టాలన్న నెటిజన్‌.. యాంకర్ జబర్దస్త్ రిప్లై

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

Trending News