Prabhas No.1: 2022 టాప్ హీరోగా ప్రభాస్.. టాప్ టెన్ లిస్టులో ఉన్న హీరోలు ఎవరంటే?

Prabhas No.1 in 2022 : పాన్ ఇండియా హీరోగా ఎస్టాబ్లిష్ అయిన ప్రభాస్ క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు, సినిమాల హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా ఆయన క్రేజ్ 2022లో నెంబర్ వన్ హీరోగా నిలబడ్డారు. ఆ వివరాలు

Written by - Chaganti Bhargav | Last Updated : Jan 21, 2023, 04:47 PM IST
Prabhas No.1: 2022 టాప్ హీరోగా ప్రభాస్.. టాప్ టెన్ లిస్టులో ఉన్న హీరోలు ఎవరంటే?

Prabhas Number 1 in Most popular male Telugu film stars For 2022: తెలుగులో టాప్ హీరోలు ఎవరు? అని ప్రతినెలా సర్వే నిర్వహించి లిస్ట్ విడుదల చేసే ఆర్ మాక్స్ మీడియా సంస్థ 2022 సంవత్సరానికి ఎవరెవరు ఆ లిస్టులో స్థానం సంపాదించారు అనే అంశం మీద ఒక లిస్ట్ విడుదల చేసింది.  
ఇక ప్రతి నెలా మొదటి స్థానంలో నిలుస్తూ వచ్చినట్టుగానే ఈ లిస్టులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మొదటి స్థానాన్ని సంపాదించాడు. ఇక  రెండవ స్థానాన్ని జూనియర్ ఎన్టీఆర్ దక్కించుకున్నారు.
పుష్ప సినిమాతో హిట్ అందుకుని అల్లు అర్జున్ నాలుగో స్థానం దక్కించుకున్నారు, ఎక్కువ ఇక ఎప్పుడూ ఏడు -ఎనిమిది స్థానాలలో ఉండే రామ్ చరణ్ ఈసారి ఏడాది లిస్టులో నాలుగో స్థానం దక్కించుకున్నాడు. 
ఇక ఈ మోస్ట్ పాపులర్ హీరోలు 2022 జాబితాలో మహేష్ బాబు ఐదవ స్థానం సంపాదించుకున్నాడు, అలాగే పవన్ కళ్యాణ్ ఆరో స్థానం దక్కించుకున్నాడు. 
అదే విధంగా మోస్ట్ పాపులర్ హీరోలు 2022 జాబితాలో నేచురల్ స్టార్ నాని ఏడవ స్థానం సంపాదించగా విజయ్ దేవరకొండ ఎనిమిదవ స్థానం సంపాదించారు. 
అదే విధంగా మెగాస్టార్ చిరంజీవి తొమ్మిదవ స్థానం సంపాదించగా అదే సమయంలో రవితేజ పదో స్థానం సంపాదించడం హాట్ టాపిక్ అయింది. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 
 
 

Trending News