Maruti Suzuki Cars: కొత్త కారు కొనే వారికి భారీ షాక్.. ఆల్టో నుంచి బ్రెజా వరకు పెరిగిన ధరలు!

Maruti Suzuki hikes all Cars prices from January 2023. మారుతీ సుజుకీ సంస్థ తమ అన్ని మోడళ్ల ధరలను దాదాపు 1.1 శాతం పెంచినట్లు తెలిపింది. ఈ ధరలు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి.   

Written by - P Sampath Kumar | Last Updated : Jan 16, 2023, 02:16 PM IST
  • కొత్త కారు కొనే వారికి భారీ షాక్
  • ఆల్టో నుంచి బ్రెజా వరకు పెరిగిన ధరలు
  • అన్ని మోడళ్లపై 1.1 శాతం
Maruti Suzuki Cars: కొత్త కారు కొనే వారికి భారీ షాక్.. ఆల్టో నుంచి బ్రెజా వరకు పెరిగిన ధరలు!

Maruti Suzuki All Models Cars to get costlier by 1.1 percent from today: మీరు కొత్త కారు కొనాలని ఆలోచిస్తున్నట్లయితే.. మీకు ఓ చేదు వార్త. మారుతీ సుజుకీ ఇండియా తన కార్ల ధరలను పెంచింది. దేశంలోని అతి పెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతీ.. సోమవారం (2023 జనవరి 16) తమ అన్ని మోడళ్ల ధరలను దాదాపు 1.1 శాతం (Maruti Price Hike) పెంచినట్లు తెలిపింది. ఈ ధరలు నేటి నుంచే అమల్లోకి వచ్చాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మారుతీ కంపెనీ తన కార్ల ధరలను రెండోసారి పెంచింది. అంతకుముందు ఏప్రిల్ 2022లో వాహనాల ధరలను పెంచింది. జనవరిలో ఈ ధరలు పెరుగుతాయని కంపనీ గతంలోనే పేర్కొంది. 

పెరుగుతున్న ఖర్చుల ప్రభావాన్ని తగ్గించేందుకు తమ వాహనాల ధరలను పెంచుతామని 2022 డిసెంబర్‌లో మారుతీ సుజుకీ ఓ ప్రకటనలో తెలిపింది. దీనితో పాటు ఏప్రిల్ 2023 నుంచి అమల్లోకి వచ్చే కఠినమైన ఉద్గార ప్రమాణాల (RDE Norms) కారణంగా కూడా ధరలు పెరిగాయి. చౌకైన హ్యాచ్‌బ్యాక్ కార్లు కాకుండా... కంపెనీ భారతదేశంలో ఎస్‌యూవీలను కూడా విక్రయిస్తుంది. ఈ కార్ల ధర రూ. 3.39 లక్షల నుంచి  రూ. 19.49 లక్షలుగా ఉన్నాయి.

మారుతి సుజుకి ఇటీవలే తన జిమ్నీ మరియు ఫ్రాంక్స్ ఎస్‌యూవీలను 'ఆటో ఎక్స్‌పో' 2023 (Auto Expo 2023)లో పరిచయం చేసింది. మారుతి జిమ్నీ (Maruti Jimny) కారు మారుతీ సుజుకీ సంస్థ యొక్క మొదటి 4X4 స్‌యూవీ. ఇది మహీంద్రా థార్ కారుతో పోటీ పడనుంది. మారుతి జిమ్నీ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. 

మారుతి ఫ్రాంక్స్ (Maruti Fronx) కంపెనీ యొక్క బాలెనో మాదిరి ఒక ఎస్‌యూవీ. ఈ కారు ఫ్రంట్ గ్రిల్ మరియు హెడ్‌ల్యాంప్‌లు గ్రాండ్ విటారాలా ఉంటాయి. ఇది కంపెనీ యొక్క 4 మీటర్ల కంటే చిన్న ఎస్‌యూవీ. మారుతి ఫ్రాంక్స్ కారు టాటా పంచ్‌తో పోటీపడుతుంది. ఇందులో 360-డిగ్రీ కెమెరా మరియు 40కి పైగా కనెక్ట్ చేయబడిన కార్ ఫీచర్లు ఉంటాయి.

Also Read: Best Hyundai Creta: రూ. 8 లక్షలకే హ్యుందాయ్ క్రెటా.. వెంటనే కొనేసుకోండి! ఈ అవకాశం మళ్లీమళ్లీ రాదు  

Also Read: Virat Kohli Centuries: విరాట్ కోహ్లీ అలా చేస్తేనే.. సచిన్ 100 సెంచరీలు అందుకోగలడు: సునీల్ గవాస్కర్  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News