సునామీ. Tsunami.ఈ పదం వినడం అదే తొలిసారి. సముద్రగర్భంలో అత్యంత తీవ్రమైన భూకంపాన్ని సునామీగా పిలుస్తారు. అదే జరిగింది. లక్షలాది కుటుంబాల్లో ఘోర కలిని మిగిల్చిన ఆ ఉపద్రవానికి నేటికి సరిగ్గా 18 ఏళ్లు.
హిందూ మహా సముద్రం. అంతవరకూ ప్రశాంతంగానే ఎప్పటిలానే ఉంది. మత్స్యకారులు సముద్రంలో వేటలో ఉన్నారు. సముద్రతీరాల్లో జనం ఎంజాయ్ చేస్తున్నారు. బీచ్‌లన్నీ సందర్శకులతో కళకళలాడుతున్నాయి. ఇదేమీ ఒక్క దేశం దృశ్యం కాదు. హిందూ మహా సముద్రం తీరప్రాంతంలో పరిస్థితి. అంటే ఇండియా, థాయ్‌లాండ్, ఇండోనేషియా, శ్రీలంక సహా 14 దేశాల్లో ఇదే పరిస్థితి. అంతలోనే ఊహించని ఉపద్రవం. ఇండోనేషియా సమీపంలో సముద్రగర్భంలో అత్యంత తీవ్రతత 9.1 రిక్టర్ స్కేలుతో భూకంపం. ఫలితంగా సముద్రం ఒక్కసారిగా పైకి ఉప్పొంగింది. ఉవ్వెత్తున ఎగిసింది. రాకాసి అలలు సముద్ర తీరం దాటి..ఊర్లలోకి చొచ్చుకెళ్లిపోయాయి.
ఏం జరుగుతుందో తెలిసే లోగా భారీ కెరటాలు..ఎవర్నీ లెక్క చేయలేదు. లక్షలాది జనంతో సహా అడ్డొచ్చిన ప్రతిదాన్నీ లాక్కెళ్లిపోయాయి. ఒక్క చెన్నై మెరీనా బీచ్‌లోనే 500 మంది ప్రాణాలు సముద్రంలో కల్సిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా 2 లక్షల 30 వేలమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇండోనేషియా పూర్తిగా ధ్వంసమైంది. శ్రీలంక అతలాకుతలమైంది, ధాయ్‌లాండ్, ఇండియా సముద్రతీర పట్టణాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. సునామీ ప్రభావం ఏపీలోని ప్రకాశం జిల్లాలోనూ కన్పించింది. ఇక్కడ కూడా 35 మంది మృత్యువాత పడ్డారు.
ఈ ఘోరకలి జరిగింది 2004 సంవత్సరం డిసెంబర్ 26. అంటే నేటికి సరిగ్గా 18 ఏళ్లు. హిందూ మహా సముద్రం తీర ప్రాంత ప్రజలకు డిసెంబర్ 26 అంటే ఇప్పటికీ వణుకు పుడుతుంటుంది. కారణం నాడు కళ్ల ముందు కెరటాల్లో కొట్టుకుపోతున్న ఆప్తులు గుర్తొస్తుంటారు. ఏం చేయలేని నిస్సహాయత వెంటాడుతుంటుంది. ఇలాంటి పెను ఉప్రద్రవాలు తిరిగి జరగకూడదంటూ భగవంతుడిని ప్రార్ధిస్తుంటారు.
Also read: Boksburg Explosion Videos: ఎల్పీజీ ట్యాంకర్ పేలి 10 మంది మృతి, 40 మందికి గాయాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook