కొలెస్ట్రాల్ అనేది శరీరంలో మైనం లాంటి ఓ పదార్ధం. శరరంలో ఆరోగ్యకరమైన సెల్స్ నిర్మాణంలో కొలెస్ట్రాల్ కీలకపాత్ర పోషిస్తుంటుంది. అదే సమయంలో కొలెస్ట్రాల్ పరిమితి పెరిగితే మాత్రం గుండెపోటు ముప్పు అధికమౌతుంది.
కొలెస్ట్రాల్ పెరగడం వల్ల అధిక రక్తపోటు కారణంగా రక్త నాళికల్లో కొవ్వు యాక్టివ్ అవుతుంది. అది ఆకస్మిక స్ట్రోక్స్, హార్ట్ ఎటాక్స్‌కు దారి తీస్తుంది. కొలెస్ట్రాల్ పెరగడం వల్ల ఛాతీ నొప్పి వస్తుంటుంది. ఈ పరిస్థితి ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేయవద్దు. ఎందుకంటే కొలెస్ట్రాల్ స్థాయిపెరిగితే గుండెకు రక్త సరఫరాలో ఇబ్బంది ఏర్పడుతుంది. ఫలితంగా ఛాతీ నొప్పి వంటి సమస్య అధికమౌతుంది.
హార్ట్ ఎటాక్స్, స్ట్రోక్స్
కొలెస్ట్రాల్ పెరగడం వల్ల హార్ట్ ఎటాక్ ముప్పు మరింతగా పెరుగుతుంది. కొలెస్ట్రాల్ స్థాయి పెరిగినప్పుడు ధమనుల్లో బ్లాక్స్ ఏర్పడుతాయి. ఇవి రక్త ప్రసరణలో ఆటంకం కల్గిస్తాయి. దాంతో గుండె భాగాలకు రక్త సరఫరా సరిగ్గా జరగక..హార్ట్ ఎటాక్ వస్తుంటుంది. కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు స్ట్రోక్ సమస్య పెరుగుతుంది. స్ట్రోక్ అనేది రక్త సరఫరాలో ఆటంకాలు ఎదురైనప్పుడు ఉత్పన్నమయ్యే సమస్య.
అధిక రక్తపోటు సమస్య
కొలెస్ట్రాల్ పెరగడం వల్ల అధిక రక్తపోటు సమస్య ఉంటుంది. గుండెపై ఒత్తిడి పెరిగితే రక్తపోటు పెరుగుతుంది. కొలెస్ట్రాల్ పెరగడం వల్ల కిడ్నీరోగాలు తలెత్తుతాయి. అందుకే కొలెస్ట్రాల్ పెరిగితే ఆ ప్రభావం మొత్తం ఆరోగ్యంపై పడుతుంటుంది.
Also read: Weight Loss: చలి కాలంలో నల్ల మిరియాలతో బరువు తగ్గడమేకాకుండా..ఈ 4 తీవ్ర వ్యాధులకు చెక్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook