/telugu/photo-gallery/how-to-make-easy-and-delicious-bakery-style-plum-cake-here-pr-ocess-of-making-rv-187168 Plum Cake: క్రిస్మస్‌కు ఇంట్లోనే ప్లమ్‌ కేక్ చేసుకుందాం.. తయారీ విధానం ఇలా Plum Cake: క్రిస్మస్‌కు ఇంట్లోనే ప్లమ్‌ కేక్ చేసుకుందాం.. తయారీ విధానం ఇలా 187168

Shraddha Murder Case Updates: దేశవ్యాప్తంగా సంచలనం రేకిత్తించిన శ్రద్ధా హత్య కేసులో నిందితుడు అఫ్తాబ్ విచారణలో ఒక్కో విషయం బయటపెడుతున్నాడు. ప్రస్తుతం జైలులో ఉన్న అఫ్తాబ్‌కు సంబంధించి మరో రహస్యం బయటపడింది. అఫ్తాబ్ చెస్ చాలా బాగుతున్నాడట. అతనిలోని టాలెంట్‌ చూసి జైలు అధికారులు కూడా షాక్‌కు గురయ్యారు. ఒక్కడే రెండు వైపులా ఆడుతూ.. ఎత్తుకుపైత్తులు వేస్తున్నాడట. తనకు తానే చెక్ పెట్టుకుంటూ ఆట ఆడుతున్నాడని అధికారులు చెబుతున్నారు. 

అఫ్తాబ్ విచారణలో తప్పుదోవ పట్టిస్తున్నాడని ఢిల్లీ పోలీసులు మొదటి నుంచి అనుమానిస్తున్నారు. అతని ప్రతి కదలిక పక్కా ప్రణాళికతో కూడిన కుట్రలో భాగమే అనిపిస్తోంది. ఢిల్లీ పోలీసు సీనియర్ అధికారి మాట్లాడుతూ.. విచారణలో అఫ్తాబ్ తన తెలివితేటలు వాడుతున్నాడని చెప్పారు. ట్రిక్స్‌ ప్లే చేస్తూ తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నాడని అన్నారు. 

అఫ్తాబ్‌ గురించి మరింత సమాచారం తెలుసుకునేందుకు ఢిల్లీ పోలీసులు సైకాలజిస్ట్ సహాయం తీసుకున్నారు. శుక్రవారం అతనికి నార్కో టెస్ట్ చేయనున్నారు. ప్రస్తుతం జైలులో అఫ్తాబ్ ప్రశాంతంగా ఉన్నట్లు జైలు వర్గాలు తెలిపాయి. అతని ఫేస్‌లో ఎలాంటి ఆందోళన లేదని.. ఎక్కువ సమయం సెల్‌లో పడుకుంటున్నాడని వెల్లడించాయి. అఫ్తాబ్ ఇంత రిలాక్స్‌గా ఎలా ఉన్నాడో అని జైలు అధికారులు కూడా ఆశ్చర్యపోతున్నారు. అఫ్తాబ్ ముఖంలో వారికి ఎలాంటి భయం, పశ్చాత్తాపం కనిపించడం లేదని అంటున్నారు.

అఫ్తాబ్ పూనావాలాకు ఇప్పటికే నార్కో పరీక్ష పూర్తయింది. ఇప్పుడు అతని పోస్ట్ నార్కో పరీక్ష శుక్రవారం జరగనుంది. ఫోరెన్సిక్ సైకాలజీ విభాగం (ఎఫ్‌ఎస్‌ఎల్)కు చెందిన నలుగురు సభ్యుల బృందం తీహార్ జైలు లోపలికి వెళ్లి అఫ్తాబ్‌కు పోస్ట్ నార్కో పరీక్ష నిర్వహిస్తుంది. భద్రతా కారణాల దృష్ట్యా అఫ్తాబ్ పోస్ట్ నార్కో పరీక్షను తీహార్‌లో నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. 

Also Read: Minister KTR: ఉమ్మడి నల్గొండ జిల్లాకు మంత్రి కేటీఆర్ గుడ్‌న్యూస్.. రోడ్ల నిర్మాణానికి భారీగా నిధులు

Also Read: Vande Bharat Express: వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు మరోసారి ప్రమాదం.. ఇది నాలుగోసారి!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Section: 
English Title: 
shraddha murder case aftab aftab poonawala playing chess alone in tihar jail jail officers shocked for aftab Talent
News Source: 
Home Title: 

Shraddha Murder Case: అఫ్తాబ్‌లో సూపర్ టాలెంట్.. జైలు అధికారులకే షాక్
 

Shraddha Murder Case: అఫ్తాబ్‌లో సూపర్ టాలెంట్.. జైలు అధికారులకే షాక్
Caption: 
Shraddha Aftab (Source: File)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Shraddha Murder Case: అఫ్తాబ్‌లో సూపర్ టాలెంట్.. జైలు అధికారులకే షాక్
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Friday, December 2, 2022 - 11:44
Created By: 
Krindinti Ashok
Published By: 
Krindinti Ashok
Request Count: 
270
Is Breaking News: 
No