Homemade Weight Loss Tea in 7 Days: ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది బరువు పెరుగుతున్నారు. అయితే కొందరు చాలా తక్కువ సమయంలో ఎక్కువ బరువు తగ్గాలని వివిధ రకాల ప్రయత్నాలు చేస్తారు. అంతేకాకుండా బరువు తగ్గడానికి చాలా మంది కఠినతర వ్యాయామాలు చేస్తున్నారు. అయినప్పటికీ బరువు తగ్గలేకపోతున్నారు. అయితే ఈ సమస్య నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆయుర్వేద నిపుణులు సూచించిన పలు రకాల చిట్కాలను వినియోగించాల్సి ఉంటుంది. అంతేకాకుండా సోంపుతో తయారు చేసిన డ్రింక్స్‌ను కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ డ్రింక్స్‌లో ఉండే మూలకాలు శరీర బరువును తగ్గించడానికి ప్రభావవంతంగా పని చేస్తుంది.
బరువు తగ్గాలనుకుంటున్నారా..? ఇది తాగండి:
బరువు తగ్గించే టీ ఇదే:
ఈ బరువు తగ్గించే టీని తయారు చేయడానికి.. అర టీస్పూన్ సోంపు తీసుకోవాలి. అంతేకాకుండా అర టీస్పూన్ జీలకర్రను ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టండి. ఉదయం నిద్రలేచిన తర్వాత ఈ నీటిని వడపోసి.. మరిగించి టీ సిద్ధం చేయండి. రుచి కోసం అర టీస్పూన్ తేనెను జోడించి తీసుకుంటే చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
సోంపు టీ:
ఈ టీని తయారు చేయడానికి సోపు, జీలకర్రను కలిపి పాన్ వేయించాల్సి ఉంటుంది. వాటిని మెత్తగా పొడి చేస.. ఒక చెంచా ఈ పొడిని ఉడికించిన నీటిలో కలిపి వేడిగా త్రాగాలి. ఇలా క్రమం తప్పకుండా తాగితే శరీరానికి కావాల్సిన చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
ఈ టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:
>>ఈ టీ తాగడం వల్ల బరువు తగ్గడమే కాకుండా శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా శరీరంలో టాక్సిన్స్ తొలగిపోయి. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి.
>>ఈ టీని ప్రతి రోజూ తాగితే జీర్ణక్రియపై మంచి ప్రభావాన్ని చూపుతుంది. అజీర్తి సమస్యను దూరమవుతాయి.
>> కడుపులోని గ్యాస్‌ను తొలగిపోవడానికి..పొట్టలో అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది.
>>ముఖ్యంగా చర్మ సమస్యలతో బాధపడుతున్నవారికి ఈ టీ చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది. కాబట్టి చర్మ సమస్యలతో బాధపడుతున్నవారు తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది.
>>ఇందులో ఉండే పోషకాలు శరీరంలో టాక్సిన్స్ పరిమాణాలను తగ్గించి అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది.
Also Read : Matti Kusthi : మొదటి పెళ్లి అందుకే చెడింది.. గుత్తా జ్వాలాకు 24 గంటలు అదే పని.. విష్ణు విశాల్ కామెంట్స
Also Read : Jai Balayya Vs Boss Party : ఓడిన బాలయ్య.. నెగ్గిన చిరు.. తమన్‌పై దేవీ శ్రీ ప్రసాద్ పై చేయి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook