PM Modi in Ayodhya: దీపావళి పండుగను పురస్కరించుకుని ప్రతి ఏటా అయోధ్యలో దీపోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆదివారం యూపీలోని అయోధ్యలో నిర్వహించే ఈ దీపోత్సవ వేడుకల్లో తొలిసారిగా ప్రధాని మోదీ (PM Modi) పాల్గొననున్నారు. ఇక్కడ దీపోత్సవ వేడుకలు (Ayodhya Deepotsav 2022) నిర్వహించడం ఇది ఆరోసారి. ఈ సందర్భంగా దాదాపు 18 లక్షల మట్టి దీపాలను వెలిగించనున్నారు. అంతేకాకుండా బాణసంచా, లేజర్ షో, త్రీడీ ప్రొజెక్షన్ మ్యాపింగ్ షో, రామ్ లీలా వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. సరయు నది ఒడ్డున రామ్ కి పైడి వద్ద 22వేల మందికిపైగా వాలంటీర్లు 15లక్షలకుపైగా దీపాలను వెలిగించనున్నారు.
సరయూ నదీ తీరం దీపోత్సవానికి రెడీ అయింది. వివిధ దేశాలకు చెందిన కళాకారులు ప్రధాని మోదీ సమక్షంలో రామ్‌లీలాను ప్రదర్శించనున్నారు. దాదాపు 3 గంటలకుపైగా మోదీ అయోద్యలో గడపనున్నారు. దీపోత్సవ వేడుకల్లో భాగంగా మోదీ శ్రీరామునికి లాంఛనప్రాయ పట్టాభిషేకం చేయడంతోపాటు సీతారాములకి, లక్ష్మణుడికి హారతి ఇవ్వనున్నారు. అంతేకాకుండా రామమందిర నిర్మాణ పనులను కూడా పరిశీలించనున్నారు. అనంతరం ప్రధాని సరయూ నదీ తీరంలోని హారతి కార్యక్రమంలో పాల్గొంటారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ సమక్షంలో దాదాపు రూ.4వేల కోట్ల విలువైన పథకాలకు శ్రీకారం చుట్టనున్నారు.
Also Read: Uttar Pradesh: మట్టి కోసం వెళ్లి... నీటిలో మునిగి ఐదుగురు బాలికలు మృతి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook