Akkineni Nagarjuna may Work with Mohan Raja: ఈ మధ్యకాలంలో నాగార్జున వరుస హిట్ సినిమాలు అందుకున్నాడు. మన్మధుడు 2 డిజాస్టర్ తర్వాత వైల్డ్ డాగ్ తో హిట్ అందుకున్నారు. తర్వాత బంగార్రాజు, ఇటీవల వచ్చిన ది ఘోస్ట్ సినిమాలు పాజిటివ్ టాక్ వచ్చినా అన్నిట్లో బంగార్రాజు సినిమా ఒకటే కలెక్షన్లు రాబట్టగలిగింది. ఒకరకంగా ఇప్పుడు ఆయన సరైన హిట్, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించి కలెక్షన్లు కురిపించే మంచి సినిమా కోసం పరితపిస్తున్నాడు.
నాగార్జున హీరోగా నటించిన ది ఘోస్ట్ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చేయడంతో ఇప్పుడు ఆయన తదుపరి సినిమా ఏమిటనే చర్చ జరుగుతుంది. తాజాగా సమాచారం మేరకు ఆయన మోహన్ రాజాతో ఒక సినిమా చేసే అవకాశం ఉందని అంటున్నారు. నిజానికి మోహన్ రాజా నాగార్జునకు గాడ్ ఫాదర్ సినిమాని ఒప్పుకోకుంటే ముందే సినిమా కథ చెప్పారని, అప్పుడు ఎలాంటి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు కానీ ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు నాగార్జున ఆసక్తి చూపిస్తున్నారు అని తెలుస్తుంది.
గాడ్ ఫాదర్ సినిమాకి చేసిన మార్పులు గాడ్ ఫాదర్ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చూసిన తర్వాత ఆయన ఈ సినిమా చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. నాగార్జున ఇంకో రెండు సినిమాలు చేస్తే 100 సినిమాలు పూర్తి అవుతాయి. 100వ సినిమా వరకు అన్ని హిట్ సినిమాలు అందుకునేలా ఆయన ప్లాన్ చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. మరోపక్క నాగార్జున తాజా ఇంటర్వ్యూలో తాను మరో మూడు నెలలపాటు ఎలాంటి ప్రాజెక్ట్ ఒప్పుకునే అవకాశం లేదని మూడు నెలలు రెస్ట్ తీసుకుంటానని పేర్కొన్నారు.
ది ఘోస్ట్ సినిమా టాక్ బాగానే ఉన్నా ప్రేక్షకులను థియేటర్లకు రాబట్టడంలో మాత్రం ఎంత మాత్రం ఉపయోగపడడం లేదు. ఎందుకో ఏమో తెలియదు కానీ ది ఘోస్ట్ సినిమా చూసేందుకు ప్రజలు ఆసక్తి చూపించడం లేదు. ది ఘోస్ట్ సినిమాకు ప్రవీణ్ సత్తార్ డైరెక్టర్ గా వ్యవహరించగా సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహనరావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మించారు.
Also Read: Balakrishna House Kabja: సర్కార్ స్థలం కబ్జా చేసిన బాలకృష్ణ.. సోషల్ యాక్టివిస్ట్ సంచలన ఆరోపణలు!
Also Read: Aarnav - Divya: నాది వివాహేతర సంబంధం కాదు.. నా భార్యకు అతనితో గర్భం.. ఆర్నవ్ సంచలనం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook