Health Diet: పోషక పదార్ధాల అవసరం పురుషులు, మహిళలకు ఒకేలా ఉండదు. ఆరోగ్యంగా ఉండేందుకు ఎవరికి ఏం అవసరమనేది తెలుసుకుందాం..
ఆధునిక జీవనశైలి కారణంగా చాలామందికి ఆరోగ్యంపై శ్రద్ధ తగ్గిపోతోంది. ఆహారపు అలవాట్లలో మార్పులు, నిద్రలేమి, జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వంటి కారణాలతో శరీరంలో పోషక పదార్ధాల కొరత ఏర్పడుతోంది. ఫలితంగా పలు రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ముఖ్యంగా ఉదయం బ్రేక్‌ఫాస్ట్ మానేయడం అనేది మరో పెద్ద సమస్య. స్వల్పకాలికంగా ఆరోగ్యంపై ప్రభావం చూపించకపోవచ్చేమో గానీ..దీర్ఘకాలికంగా కచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. అందుకే ఎలాంటి డైట్ అవసరమో తెలుసుకుందాం..
ఆరోగ్య నిపుణులు ప్రకారం మహిళలు, పురుషులకు వేర్వేరుగా పోషక పదార్ధాల అవసరముంటుంది. కేలరీలు, ప్రోటీన్లు, ఐరన్, కాల్షియం వంటివి ఇందులో కీలకం. మగవారికి కేలరీలు ఎక్కువ అవసరమౌతాయి. అదే విధంగా ప్రోటీన్లు కూడా ఎక్కువ కావల్సి వస్తుంది. వాస్తవానికి మగవారిలో మాంసకృతుల భాగం ఎక్కువగా ఉండటంతో..కేలరీలు కూడా అధికంగా అవసరమౌతాయి. అందుకే పురుషులు ప్రోటీన్లు, కేలరీలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి.
అదే మహిళలకు మాత్రం కాల్షియం ఎక్కువగా అవసరమౌతుంది. ఎందుకంటే మహిళల్లో ఆస్టియోపోరోసిస్ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాల్షియం పరిమాణం ఎక్కువగా ఉండే డైట్ తీసుకోవాలి. ముఖ్యంగా ఆకుపచ్చ కూరగాయలు, ఆకు కూరగాయలు, సోయాబీన్ వంటివి డైట్‌లో భాగం చేసుకోవాలి. మగవారితో పోలిస్తే మహిళలకు ఐరన్ అవసరం ఎక్కువే. పీరియడ్స్ సమయంలో శరీరం నుంచి ఎక్కువగా ఐరన్ నష్టపోతుంటారు. అందుకే మహిళలు ఆనపకాయ, నువ్వులు, పాలకూర ఎక్కువగా తీసుకోవాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook