Kidney Stone Treatment: కిడ్నీల్లో రాళ్ల సమస్యలు వస్తే నొప్పి తట్టుకోవడం చాలా కష్టం. మరి కొందరైతే నొప్పి తట్టుకోక వైద్యులను సంప్రదించిన రోజులు కూడా ఉన్నాయి. అయితే ఈ సమస్యల బారిన పడితే తీవ్ర అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కిడ్నీల్లో ఈ సమస్యలు తీవ్రంగా ఉంటే తప్పకుండా వైద్యులను సంప్రదించి.. శస్త్రచికిత్సను పొందడం చాలా మంచిది. లేకపోతే కిడ్నీలు చెడిపోయే చాన్స్‌లు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఆపరేషన్ లేకుండా కూడా కిడ్నీల్లో రాళ్లను నియంత్రించవచ్చని నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా దీనికి పలు రకాల హోం రెమెడీస్‌ని పాటించాల్సి ఉంటుంది. అయితే చాలా మంది వైద్య నిపుణులు కిడ్నీల్లో రాళ్లు ఉంటే.. ఎక్కువగా నీరు తాగాలని సూచిస్తారు. ఈ సమస్యతో బాధపడే వ్యక్తి రోజంతా కనీసం 10 నుంచి 12 గ్లాసుల నీరు తాగాలి. ఇలా తాగడం వల్ల రాళ్లు కరిగి మూత్రంలో పడిపోయే అవకాశాలున్నాయి. కావును ఈ సమస్యలతో బాధపడే వారు నీటినీ ఎక్కువగా తాగాలి.
ఈ ఆహార నియమాలు పాటిస్తే కిడ్నీల స్టోన్స్ మటు మాయం:
యాపిల్ తింటే కిడ్నీ స్టోన్ తగ్గుతాయా..?:
కిడ్నీల స్టోన్స్ నుంచి ఉపశమనం పొందడానికి.. రోజూ యాపిల్ తినడం వల్ల రాళ్ల నొప్పుల సమస్యలు దూరమవుతాయని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా రోజూ ఒక యాపిల్ జ్యూస్ తాగడం కిడ్నీ సమస్యలు తొలగిపోతాయి.
గోధుమ నీరు:
రాళ్ల సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి గోధుమలు చాలా రకాలుగా మేలు చేస్తాయని నిపుణలు తెలుపుతున్నారు. బార్లీ నీటిలో ఉండే పోషకాలు రాళ్లను తొలగించడానికి చాలా ప్రభావవంతంగా కృషి చేస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారు వీటితో చేసిన ఆహారాలను రోజూ తీసుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు.
కొత్తిమీర:
కొత్తిమీర ఆహార రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి మంచి ప్రయోజనాలను చేకూర్చుతుంది. కొత్తిమీరలో డిటాక్సిఫికేషన్ లక్షణాలు ఉంటాయి. కావున రాళ్ల చికిత్సకు ప్రభావవంతంగా పని చేస్తుంది. రాళ్ల సమస్యలతో బాధపడే వారు కొత్తిమీర గింజలు, పచ్చి కొత్తిమీర ఆహారంలో తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
అరటిపండు:
రాళ్ల సమస్య నుండి బయటపడాలంటే.. తప్పకుండా అరటిపండ్లను తీసుకోవాలని నిపుణులు తెలుపుతన్నారు. అరటిపండులో విటమిన్ బి పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలో రాళ్లను ఏర్పడకుండా నిరోధిస్తుంది.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Radhana Ram: ఇండస్ట్రీకి మరో వారసురాలు..ఏకంగా పాన్ ఇండియన్ మూవీలో హీరోయిన్ గా ఎంట్రీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook