Surya Bhagavan Puja: హిందూమతంలో, సూర్యుడిని దేవుడిగా ఆరాధిస్తారు, పూజిస్తారు. హిందూ శాస్త్రాల ప్రకారం వారంలోని ఏడు రోజులలో ఒక్కో రోజు ఒక్కో దేవుడిని, దేవతను కొలుస్తారు. ఆదివారం సూర్య భగవానుడిని కొలుస్తారు. జాతకంలో సూర్యుడి సంచారం బలంగా ఉన్నట్లయితే.. ఆ వ్యక్తికి జీవితంలో అన్నీ కలిసొస్తాయి. ఆర్థికపరంగా ఉన్నత స్థితిలో ఉంటాడు. ఇవాళ ఆదివారం కాబట్టి సూర్య భగవానుడిని ఎలా ప్రసన్నం చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం...
సూర్య భగవానుడిని ఎలా పూజించాలి :
ఉదయం నిద్ర లేచి స్నానం చేశాక సూర్యోదయానికి నమస్కరించండి. ఉదయించే సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి. అర్ఘ్యాన్ని ఇచ్చే నీటిలో ఎర్రటి పువ్వులు, అక్షత, పంచదార కలపండి. ఆ సమయంలో, ఓం ఘృణి సూర్యాయ నమః అనే మంత్రాన్ని జపించండి. సూర్యునికి అర్ఘ్యం సమర్పించిన తర్వాత, తూర్పు ముఖంగా ఎర్రటి వస్త్రంపై కూర్చుని సూర్య మంత్రాన్ని 108 సార్లు జపించండి.
అలా ఆదిత్య అనే పేరు వచ్చింది :
సూర్యుడికి మరో పేరే ఆదిత్య. ఓం అనే పదం సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుని నోటి నుండి ఉద్భవించింది. అదే సూర్యుని ప్రారంభ సూక్ష్మ రూపంగా పరిగణించబడింది. దీని తరువాత భూ, భువ్, స్వా అనే మూడు పదాలు ఉద్భవించాయి. సూర్యుడు విశ్వం ఆరంభంలో జన్మించినందునా ఆదిత్య అనే పేరు వచ్చింది. సూర్య దేవుడే నిజమైన నారాయణుడు.
సూర్య దేవుడు హనుమంతుడి గురువు
మతపరమైన, పౌరాణిక విశ్వాసాల ప్రకారం సూర్య నారాయణుడు రామ భక్తుడైన హనుమంతునికి విద్యా గురువు కూడా.
సాహిత్యపరమైన అర్థం ఇదే :
సూర్య అనే పదానికి అక్షరార్థం అందరినీ ప్రేరేపించేది. సూర్యభగవానుడు అన్ని చోట్లా కాంతిని ఇచ్చేవాడు. అందుకే అందరికి శ్రేయోభిలాషి అని అంటారు. ఋగ్వేదంలోని దేవతలలో సూర్య భగవానుడికి ప్రత్యేక స్థానం ఉంది. గాయత్రీ మంత్రం సూర్యునిపై మాత్రమే కూర్చబడింది. సూర్య ఉపనిషత్తులో, మొత్తం సృష్టి ఆవిర్భావానికి సూర్యుడు మాత్రమే కారణమని వివరించబడింది.
హిందూ మతంలో పంచాయతన ఆరాధన ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. శాస్త్రాల ప్రకారం, ప్రతి గృహస్థుని పూజా గృహంలో ఐదుగురు దేవతలు ఉండాలి. వారిలో గణేశుడు, శివుడు, విష్ణువు, దుర్గతో పాటు సూర్య భగవానుడు ఒకరు.
Also Read: Agnipath recruitment : అగ్నివీరులకు ప్రత్యేక ర్యాంక్.. ఎయిర్ ఫోర్స్ రిక్రూట్ మెంట్ ప్రాసెస్ రిలీజ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook