ఉన్నావ్ కేసు: కర్ణాటకలో కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో జరిగిన అత్యాచారం కేసు వచ్చే నెలలో ఎన్నికలు జరుగనున్న కర్ణాటకలో కాంగ్రెస్‌, బీజేపీల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది.

Last Updated : Apr 15, 2018, 05:18 PM IST
ఉన్నావ్ కేసు: కర్ణాటకలో కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో జరిగిన అత్యాచారం కేసు వచ్చే నెలలో ఎన్నికలు జరుగనున్న కర్ణాటకలో కాంగ్రెస్‌, బీజేపీల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. ఆదిత్యనాథ్‌ను చెప్పులతో కొట్టాలని పేర్కొంది. దీనిపై బీజేపీ ఘాటుగా స్పందించింది. కాంగ్రెస్‌ పార్టీ నేతలు క్షమాపణలు చెప్పాలంటూ బీజేపీ డిమాండ్‌ చేస్తోంది. శనివారం కర్ణాటక కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ దినేశ్‌ గుండూరావు మాట్లాడుతూ భారత రాజకీయాలకు యోగి ఆదిత్యనాథ్‌ అవమానకరమైన వ్యక్తి అని అన్నారు. ఆదిత్యనాథ్‌కు ఏమాత్రం గౌరవ మర్యాదలున్నా తన పదవికి రాజీనామా చేయాలని అన్నారు.

ఈ వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్ప దినేశ్‌ గుండూరావు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. "యోగి ఆదిత్యనాథ్ పై గుండూరావు వాడిన భాష సరైంది కాదు. ఆయన ఒక రాష్ట్రానికి సీఎం, అంతేకాదు గౌరవనీయమైన నాథ కుటుంబానికి చెందిన సాధువు (సెయింట్). కర్ణాటకలోని లక్షలాది మంది 'నాథ' అనుచరులు దీనిని ఎప్పటికీ క్షమించరు. ఇది మీకు, మీ పార్టీ సంస్కృతికి తగదు. ఆదిత్యనాథ్‌కు వెంటనే క్షమాపణ చెప్పాల్సిందే" అని యడ్యూరప్ప  ట్విట్టర్ లో పేర్కొన్నారు.

 

 

 

 

Trending News