Decomposed Body in JNU: ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ)లో కుళ్లిపోయిన స్థితిలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. క్యాంపస్‌లోని అటవీ ప్రాంతంలో ఓ చెట్టుకు వేలాడుతూ మృతదేహం కనిపించింది.బాగా కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో మృతుడిని గుర్తుపట్టడం కష్టంగా మారింది. జేఎన్‌యూ విద్యార్థులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... జేఎన్‌యూ విద్యార్థులు కొందరు క్యాంపస్‌లో వాకింగ్ చేస్తూ యమునా హాస్టల్ సమీపంలోని అటవీ ప్రాంతం వైపు వెళ్లారు. ఈ క్రమంలో అక్కడ తీవ్ర దుర్వాసన రావడం గమనించారు. కొద్ది దూరంలోనే ఓ చెట్టుకు మృతదేహం వేలాడుతున్నట్లు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు.
హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహం బాగా కుళ్లిపోయి ఉండటంతో.. ఆ వ్యక్తి మరణించి కొద్ది రోజులు కావొస్తుందని పోలీసులు గుర్తించారు. మృతుడి వయసు 40-45 ఏళ్లు ఉండొచ్చునని గుర్తించారు. మృతదేహం బాగా కుళ్లిపోయిన కారణంగా అతనెవరనేది గుర్తుపట్టరాకుండా ఉందని పోలీసులు తెలిపారు. అతను జేఎన్‌యూకి చెందిన వ్యక్తేనా... లేక బయటి వ్యక్తా అన్నది తేలాల్సి ఉంది. క్యాంపస్ వర్గాలు అతను బయటి వ్యక్తే అయి ఉంటాడని అనుమానం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
Also Read: Hyderabad Gangrape: జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ ఘటనపై ఆనంద్ మహీంద్ర రియాక్షన్.. ఏమన్నారంటే..?
Also Read: Gold Price Today: పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్.. వరుసగా రెండో రోజు భారీగా పెరిగిన బంగారం ధరలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook