Maharashtra: కుటుంబ కలహాల నేపథ్యంలో... ఆరుగురు పిల్లలను బావిలోకి తోసి చంపిన తల్లి!

Maharashtra:  ఓ మహిళ తన ఆరుగురు పిల్లలను బావిలో పడేసి చంపేసిన ఘటన మహారాష్ట్ర మహాడ్​లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..  

Edited by - ZH Telugu Desk | Last Updated : May 31, 2022, 10:28 AM IST
Maharashtra: కుటుంబ కలహాల నేపథ్యంలో... ఆరుగురు పిల్లలను బావిలోకి తోసి చంపిన తల్లి!

Maharashtra Crime news: మహారాష్ట్ర రాయ్‌గఢ్ జిల్లాలో (Raigad distric) దారుణం జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళ తన ఆరుగురు మైనర్ పిల్లలను బావిలో పడేసింది. అనంతరం తానూ కూడా బావిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో ఆరుగురు పిల్లలు చనిపోగా... సూసైడ్ కు యత్నించిన తల్లి బతికింది. ఈ షాకింగ్ ఘటన  ముంబైకి 100 కిలోమీటర్ల దూరంలోని మహాడ్​ తాలూకాలోని (Mahad taluka) ఖారావళి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మహిళను అదుపులోకి తీసుకున్నారు. మృతి చెందిన పిల్లల వయసు మునిగిపోయిన పిల్లల వయస్సు 18 నెలల నుండి 10 సంవత్సరాల మధ్య ఉంటుందని ఓ అధికారి తెలిపారు. 

మహాడ్​లోని ఖారావళి గ్రామానికి (Kharavali village) చెందిన ఓ దంపతులకు ఆరుగురు పిల్లలున్నారు. భర్త తాగుడుకు బానిసై రోజూ వేధిస్తూ ఉండేవాడు. ఈ క్రమంలోనే సోమవారం భార్యభర్తలిద్దరూ గొడవపడ్డారు. దీంతో ఆగ్రహానికి గురైన మహిళ... తన ఆరుగురు చిన్నారులను బావిలోకి తోసేసి తన కూడా దూకేసింది. స్థానికులు ఆమెను రక్షించారు. మృతి చెందిన ఆరుగురు పిల్లల్లో ఒక అబ్బాయి, ఐదుగురు అమ్మాయిలు ఉన్నారు.  గ్రామస్థుల సాయంతో నలుగురు చిన్నారులు మృతదేహాలను వెలికితీసినట్లు పోలీసులు వెల్లడించారు. 

Also Read; Rakesh Tikait Attacked: రైతు నేత రాకేశ్ టికాయత్‌పై బెంగళూరులో దాడి... ముఖం, దుస్తులపై నల్ల సిరా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G 

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News