Yashoda First Glimpse: ఆసుపత్రి బెడ్‌పై సమంత.. కిటికీలోంచి చేయి పెట్టి..!

Samantha's Yashoda Movie First Glimpse. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న సమంత 'యశోద' సినిమా ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో కొద్ది సేపటి క్రితం సమంత ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ అయింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : May 5, 2022, 12:17 PM IST
  • యశోద నుంచి ఫస్ట్ గ్లింప్స్
  • సమంత ఫస్ట్ గ్లింప్స్
  • పాన్ ఇండియా చిత్రంగా యశోద
Yashoda First Glimpse: ఆసుపత్రి బెడ్‌పై సమంత.. కిటికీలోంచి చేయి పెట్టి..!

First Glimpse from Samantha starrer Yashoda Movie: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'యశోద'. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమాగా యశోద రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రానికి హరిశంకర్ మరియు హరీశ్ నారాయణ దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక క్రిష్ణ ప్రసాద్.. యశోద సినిమాను నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న యశోద సినిమా ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో కొద్ది సేపటి క్రితం సినిమా ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ అయింది. 

ఆసుపత్రి బెడ్‌పై సమంత ఉన్న సీన్‌తో యశోద సినిమా ఫస్ట్ గ్లింప్స్ మొదలవుతుంది. యశోద ఫస్ట్ గ్లింప్స్ నిడివి 36 సెకండ్లుగా ఉంది. హాస్పిటల్ బెడ్‌పై కళ్లు తెరిచిన సమంత.. తన చుట్టూ ఏం జరుగుతుందో తెలియని అయోమయ స్థితిలో ఉంటుంది. చేతికి ఉన్న బ్యాండ్ చూసుకుని.. నెమ్మదిగా బెడ్‌పై నుంచి కిందికి దిగి బయట ప్రపంచాన్ని చూడడానికి కిటికీ వద్దకు వస్తుంది. కిటికీలోంచి చేయి పెట్టి అక్కడ ఉన్న పావురాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుండడంతో వీడియో పూర్తవుతుంది. 

యశోద సినిమా ఫస్ట్ గ్లింప్స్ లో లుక్ పరంగా సమంత అద్భుతంగా ఉంది. వైట్ కలర్ డ్రెస్సులో అమాయకపు చూపుతో సామ్ చాలా బాగుంది. యశోదలో సామ్ మరోసారి తన నటనా విశ్వరూపంను ప్రదర్శించనున్నట్లు గ్లింప్స్ చూస్తే ఇట్టే అర్ధమవుతుంది. బెడ్‌పై సమంత ఎందుకు ఉండాల్సి వచ్చింది?, చేతికి ఉన్న బ్యాండ్ ఏంటి?, అసలు ఏమైంది అనేది ఆగస్టు 12న సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ప్రస్తుతం యశోద సినిమా ఫస్ట్ గ్లింప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

యశోద సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున ఆగస్టు 12న విడుదల అవుతోంది. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మణిశర్మ అందించిన బాణీలు సినిమాకు పెద్ద ప్లస్ కానున్నాయి. సామ్ చేతిలో యశోద కాకుండా శాకుంతలం కూడా ఉంది. అలాగే విజయ్ దేవరకొండతో మరో చిత్రంలోనూ సమంత హీరోయిన్‌గా నటిస్తున్నారు.

Also Read: Virat Kohli: విరాట్ కోహ్లీని లాగి కొట్టిన చెన్నై బౌలర్.. సీన్ కట్ చేస్తే..!

Also Read: Tire Blast: భారీ శబ్ధంతో ఒక్కసారిగా పేలిపోయిన జేసీబీ టైరు.. ఇద్దరు మృతి.. వీడియో వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News