Boy playing with three snakes: పాములతో వ్యవహరం ప్రాణాలతో చెలగాటంలాంటిది. పాములజోలికి వెళ్లే సమయంలో ఎవరైనా జాగ్రత్తగా వ్యవహరించాల్సిందే. రోడ్డుపై, అడవిలో పాములు తమ దారిన అవి వెళ్తున్నప్పుడు.. వాటి జోలికి వెళ్లకుండా ఉండటమే ఉత్తమం. అలా కాకుండా పాములతో ఆడుకోవాలని చూస్తే మాత్రం.. అచ్చం ఇదిగో ఈ వ్యక్తికి ఎదురైన ఘోర అనుభవమే రిపీట్ అవుతుంది. కర్ణాటకు చెందిన మాజ్ సయ్యద్ అనే వ్యక్తి స్నేక్ క్యాచర్. అతని యూట్యూబ్ ఛానల్లో పాములకు సంబంధించిన వీడియోలే ఉంటాయి. అయితే ఓసారి అతను పాముల ముందు కూర్చొని వాటితో సాహాసాలు చేశాడు. పాముల తోకలను పట్టుకొని లాగడం, వాటిని కదిలించడం చేశాడు. చేతులు, కాళ్లతో పాములను భయపెడుతుండగా ఊహించని విధంగా అందులోని ఓ పాము అకస్మాత్తుగా అతడిపై దాడి చేసింది.
This is just horrific way of handling cobras…
The snake considers the movements as threats and follow the movement. At times, the response can be fatal pic.twitter.com/U89EkzJrFc— Susanta Nanda IFS (@susantananda3) March 16, 2022
యువకుడిపైకి జంప్ చేసి అతని మోకాలి వద్ద అతడి ప్యాంటుని కొరికి పట్టుకుంది. దీంతో షాక్కు గురైన వ్యక్తి పామును లాగేందుకు ప్రయత్నించినప్పటికీ అది ఎంతకీ విడిచి పెట్టలేదు. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నందా తన ట్విటర్లో పోస్టు చేశారు. పాములను ఇలా హ్యండ్లింగ్ చేయడం భయంకరమైనదని చెప్పారు. వ్యక్తి చేసిన కదలికలను పాము ఒక ఆపదగా భావించి.. ఆ ఆపదను ఎదుర్కునేందుకు సిద్ధమవుతుందని... కొన్నిసార్లు పాముల ప్రతిస్పందన ప్రాణాంతకం కూడా కావచ్చని సుశాంత నంద తన కామెంట్లో పేర్కొన్నారు.
ఈ వీడియో చూసి నెజటిన్లు భయంకరంగా ఉందంటూ కామెంట్ చేస్తున్నారు. పాములతో అలా స్టంట్స్ చేయొద్దని హితవు పలుకుతున్నారు.