555 carats black diamond: కోట్ల విలువైన ఈ 555 క్యారెట్ల బ్లాక్ డైమండ్ ఎక్కడిదో తెలుసా ?

Black Diamond: ప్రపంచంలోనే అరుదైన నలుపు వజ్రాన్ని లండన్ లో సోతెబీ అనే సంస్థ వేలం వేయనుంది. ఈ వజ్రం 55 ముఖాలు కలిగి ఉంది.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 19, 2022, 03:04 PM IST
  • 55 ముఖాలతో రూపుదిద్దుకున్న వజ్రం
  • 2006లోనే దాని పేరిట గిన్నిస్ రికార్డ్
  • వచ్చేనెలలో లండన్​లో వేలం
555 carats black diamond: కోట్ల విలువైన ఈ 555 క్యారెట్ల బ్లాక్ డైమండ్ ఎక్కడిదో తెలుసా ?

Black Diamond: మనం సాధారణంగా పింక్‌, బ్లూ, గ్రీన్‌ డైమండ్స్‌ చూసుంటాం.కానీ నల్లని వజ్రాన్ని ఎప్పుడూ చూసుండం. అలాంటి అరుదైన వజ్రాన్ని వచ్చేనెలలో లండన్​లో వేలం వేయనున్నారు. 555.5 క్యారెట్ల బరువు ఉన్న ఈ బ్లాక్ డైమండ్ (Black Diamond) ను దుబాయ్ (Dubai)కు చెందిన ప్రఖ్యాత వజ్రాల సంస్థ సోత్​బై (Sotheby) వేలం వేయనుంది. ఇప్పటివరకు ప్రపంచంలోని కట్ డైమండ్లలో (cut diamond) ఇదే అతి పెద్దదిగా భావిస్తున్నారు.

ఈ నల్ల వజ్రానికి 'ది ఎనిగ్మా' (The Enigma) అని పేరు పెట్టారు.  దీని ప్రత్యేకత ఏంటంటే..260 కోట్ల ఏళ్ల క్రితం ఒక ఉల్క (meteorite) లేదా గ్రహశకలం (Asteroid) భూమిని తాకినప్పుడు ఈ వజ్రం సృష్టించబడిందని సోతెబీ వేలం సంస్థ జ్యువెలరీ స్పెషలిస్ట్ సోఫీ స్టీవెన్స్ చెప్పారు. ‘''ఈ వజ్రం చాలా రేర్... దీని ఉద్భవం ఇప్పటికీ మిస్టరీనే'' అనీ, 20 ఏళ్ల క్రితం వరకు ఈ వజ్రాన్ని బయటకు తీసుకురాలేదని వివరించారు. ఆ తర్వాత నిపుణులు 55 ముఖాలతో వజ్రాన్ని రూపుదిద్దారని పేర్కొన్నారు. శక్తి, రక్షణకు చిహ్నమైన మిడిల్ ఈస్ట్ పామ్ ఆకారంలోనే (Middle-Eastern palm symbol) దీనిని రూపొందించారు. 

Also Read: Google Meet Wedding: గూగుల్ మీట్ లో పెళ్లికి ఆహ్వానం.. జొమాటో ద్వారా విందుకు ఏర్పాట్లు!

అయితే ఈ డైమండ్ అంతరిక్షం నుంచి (outer space diamond) పుట్టినట్లు భావిస్తున్నారు. అతిపెద్ద అరుదైన నలుపు వజ్రంగా 2006లో దీనికి గిన్నిస్ రికార్డు (Guinness World Record) కూడా ఉందని సోతెబీ పేర్కొంది. ప్రస్తుతం దుబాయ్ లో ఉన్న ఈ వజ్రాన్ని.. ఆ తర్వాత లాస్ ఏంజిలిస్, లండన్ (London) లకు తీసుకెళ్లనున్నారు. ఫిబ్రవరి 3న ఆన్ లైన్ లో వేలం నిర్వహించనున్నారు. ఇదో అంతరిక్ష అద్భుతం అని తెలిపిన సోతెబీ.. వేలంలో డబ్బుతో పాటు క్రిప్టోకరెన్సీని (cryptocurrency) కూడా తీసుకుంటామని చెప్పింది. ఈ వజ్రం ప్రారంభ ధర రూ. 50 కోట్లు ఉంటుందని తెలిపారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News