Team India Test Captain: దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో 2-1 తేడాతో టీమ్ ఇండియా పరాజయం పాలైన తర్వాత.. జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు శనివారం అధికారికంగా (Virat Kohli Resignation from Test Captaincy ) ప్రకటించాడు కోహ్లీ. దీనితో అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి కోహ్లీ (Virat Kohli Captaincy) నిష్క్రమించినట్లయింది.
కొత్త కెప్టెన్‌పై కసరత్తు..
అయితే టెస్టు కెప్టెన్సీ నుంచి కోహ్లీ తక్షణమే తప్పుకున్న నేపథ్యంలో.. బీసీసీఐ ముందు కొత్త సవాలు వచ్చి (BCCI on New test Test Captain) పడినట్లయింది. ఎందుకంటే వచ్చే శ్రీలంకకు టెస్టు సిరీస్‌కు ఆథిత్యం ఇవ్వనుంది ఇండియా. ఫిబ్రవరి 25 నుంచి షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ లోపే టీమ్ ఇండియా టెస్టు కెప్టెన్‌ను నిర్ణయించాల్సిన అవసరం ఏర్పడింది.
బీసీసీఐ ముందున్న ముఖ్యమైన పేర్లు..
రోహీత్ శర్మ..
వన్డే కెప్టెన్సీ నుంచి కోహ్లీని తప్పించిన తర్వాత.. రోహిత్ శర్మకు పూర్తి స్థాయి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది బీసీసీఐ. ఇప్పుడు టెస్టు కెప్టెన్సీకీ రోహిత్‌ను సెలక్టర్లు ఎంపిక చేసే అవకాశముందనే అభిప్రాయాలు (BCCI searching for captain) వ్యక్తముతున్నాయి. ఇప్పటికే టెస్టు టీమ్ వైస్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ కొనసాగుతున్న విషయం (Rohit sharma test captain) తెలిసిందే.
కేఎల్ రాహుల్..
ఒక వేళ రోహిత్ శర్మను టెస్టు టీమ్ కెప్టెన్‌గా ఎంపిక చేయకుంటే.. ఆ తర్వాత ఆప్షన్ కేఎల్ రాహుల్ అని అంచనాలు వస్తున్నాయి. దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో కోహ్లీ, రోహిత్ శర్మలు మ్యాచ్‌లకు దూరమవగా.. కేఎల్ రాహుల్ కెప్టెన్సీ బాధ్యతలు (KL Rahul test captain) నిర్వహించాడు. దీనితో అతడికి పూర్తి స్థాయి బాధ్యతలు ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
రిషబ్ పంత్..
రిషబ్ పంత్‌కు కూడా టెస్టు టీమ్ కెప్టెన్సీ బాధ్యతలు ఇచ్చే అవకాశాలున్నాయంటున్నారు నిపుణులు. యువ ఆటగాడైన పంత్‌కు బాధ్యతలు ఇస్తే ఎక్కువ కాలం కెప్టెన్సీగా కొనసాగే అవకాశముంటుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా రిషబ్ పంత్ బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం (Rishabh pant in test) తెలిసిందే.
జస్ప్రిత్ బుమ్రా..
బౌలర్ జస్ప్రిత్ బుమ్రాకు కూడా టెస్టు టీమ్ కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహించగా.. జస్ప్రీత్ బుమ్రా వైస్ కెప్టెన్‌గా (Bumrah test captain) వ్యవహరించాడు.
అయితే ఈ విషయంపై బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
Also read: Virat Kohli Test captaincy: కోహ్లీ షాకింగ్ నిర్ణయం- టెస్టు కెప్టెన్సీకి గుడ్‌బై!
Also read: IND vs SA: దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ ఓటమితో.. టీమ్ ఇండియాపై సునీల్ గావస్కర్ అసంతృప్తి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook