Makar Sakranti Significance: హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో మకర సంక్రాంతి ఒకటి. ఈ సంవత్సరం మకర సక్రాంతి పండుగ (Makar Sakranti Festival) జనవరి 14, 2022 న జరుపుకోనున్నారు. ఈ రోజున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి దీనిని మకర సంక్రాంతి అని పిలుస్తారు.
సంక్రాంతి చరిత్ర
పురాణాల ప్రకారం, సూర్య భగవానుడు అదే రోజున తన కొడుకు శని ఇంటికి వస్తాడని చెబుతారు. దీన్ని 'తండ్రీ కొడుకుల' కలయికగా ఈ పండుగను పేర్కొంటారు. అదే రోజున అసురులపై మహావిష్ణువు విజయం సాధించిన గుర్తుగా ఈ పండుగ చేసుకోంటారని మరికొంతమంది చెబుతున్నారు. ప్రతి మాసంలో ఒక సంక్రాంతి వస్తూ ఉంటుంది. అయితే ఇందులో మకరరాశిలోకి సూర్యుడు ప్రవేశించినప్పుడు మనం చేసుకునేది మకర సంక్రాంతి.
Also Read: Bhogi Festival: భోగి పండుగ ప్రాముఖ్యత ఏమిటి?
ప్రాముఖ్యత
సంక్రాంతి సంబురాలకు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక స్థానం. కొత్త సంవత్సరాదిలో వచ్చే తొలి పండుగ కావడంతో అందరూ చాలా వైభవంగా నిర్వహించుకుంటారు. ముచ్చటగా మూడు రోజుల పాటు చేసుకుంటారు ఈ పండుగను. భోగితో (Bhogi) మొదలయ్యే పండుగ కనుమతో (Kanuma) ముగుస్తుంది. కొందరు ముక్కనుమ కూడా చేసుకుంటారు. పండుగరోజుల్లో ప్రతి పల్లెలో తెలుగు సంప్రదాయం ఉట్టిపడుతుంది.
నెల రోజుల ముందు నుండే ఈ పండగ హడావుడి మెుదలవుతోంది. సంక్రాంతి (Sakranti) రోజున తెలుగు లోగిళ్లు...కొత్త అల్లుళ్ళ తోను..బంధు మిత్రులతోను కలకలలాడుతుంటాయి. ప్రతి ఇంటి ముందు రంగు రంగుల ముగ్గులు, గొబ్బమలతో స్వాగతం పలుకుతాయి. హరిదాసు సంకీర్తనలు ఆకట్టుకుంటాయి. ఈ పండుగకు ఎన్నో పిండి వంటలు చేస్తారు. కోడి పందాలు, ఎడ్ల పందాలు, గంగిరెద్దులు ఎన్నో ఆ రోజున చూడవచ్చు. ఈ పండుగ సమయంలోనే పంట మెుత్తం రైతులకు చేతికొస్తుంది. అందుకే ఎంత ఖర్చు చేయడానికైనా వారు వెనుకాడరు. తెలుగు వారు ఎక్కడున్నా సంక్రాంతికి తమ ఇంట్లో వాలిపోతారు. ఈ పండుగ నాలుగు రోజులు తెలుగు లోగిళ్లు సరికొత్త శోభను సంతరించుకుంటాయి.
ఒకే పండుగ...వివిధ పేర్లు
సంక్రాంతి పండుగను దేశవ్యాప్తంగా వివిధ పేర్లతో పిలుస్తారు. వేర్వేరు రకాలుగా చేస్తారు. మకర సంక్రాంతి నాడు గోరఖ్‌పూర్‌లోని గోరఖ్‌నాథ్ ఆలయానికి 'ఖిచ్డీ'ని సమర్పించడం ఆనవాయితీ. అదే రోజు ప్రయాగ్‌రాజ్‌లో మాగ్ మేళా నిర్వహిస్తారు. 'మాఘి' అనేది మకర సంక్రాంతికి మరో పేరు. పశ్చిమ బెంగాల్‌లో దీనిని 'పౌష్ సంక్రాంతి' (Paush Sankranti) అని, గుజరాత్‌లో 'ఉత్తరాయణం', అస్సాంలో 'బిహు' ( Bihu) అని పిలుస్తారు. గుజరాత్‌లో గాలిపటాలు ఎగురవేసి పండుగను జరుపుకుంటారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook