Corona Third Wave: కరోనా థర్డ్‌వేవ్ దేశాన్ని చుట్టుముడుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ విధించగా..తాజాగా విద్యాలయాల్ని కూడా మూసివేస్తున్నాయి. తెలంగాణలో సైతం విద్యాలయాల సెలవులు పొడిగించనున్నట్టు తెలుస్తోంది.
కరోనా థర్డ్‌వేవ్ (Corona Third Wave) దేశాన్ని బలంగా తాకింది. ప్రతిరోజూ భారీగా కరోనా కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో దేశంలోని వివిధ రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ, వీకెండ్ కర్ఫ్యూలతో పాటు కఠినమైన ఆంక్షల్ని విధిస్తున్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పటికే విద్యాలయాలకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. తెలంగాణలో కేసులు పెరుగుతున్న నేపధ్యంలో విద్యాలయాల సెలవుల్ని పొడిగించే దిశగా విద్యాశాఖ అధికారులు యోచిస్తున్నారు. తెలంగాణలో జనవరి 8 నుంచి 16 వరకూ సంక్రాంతి సెలవులున్నాయి. 17వతేదీ నుంచి విద్యాలయాలు, కళాశాలలు తిరిగి తెర్చుకోవల్సి ఉంది. అయితే కరోనా సంక్రమణను దృష్టిలో ఉంచుకుని సెలవుల్ని పొడిగించాలనేది విద్యాశాఖ అధికారుల ఆలోచన. ఈ మేరకు ఇప్పటికే మంత్రి సబితా ఇంద్రారెడ్డికి (Sabitha Indrareddy) నివేదిక సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోవల్సి ఉంది.
Also read: Telangana Corona Update: తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు... జీహెచ్‌ఎంసీ పరిధిలో భారీగా కొవిడ్ కేసులు నమోదు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook