Game Changer Twitter Review: గేమ్ ఛేంజర్ ట్విట్టర్ రివ్యూ.. ఇంటర్వెల్ ట్విస్ట్‌తో మైండ్ బ్లాక్..!

Game Changer Twitter Review and Public Talk: గేమ్ ఛేంజర్‌ మూవీతో ఆడియన్స్‌ సంక్రాంతి ట్రీట్ ఇచ్చేందుకు ముందుగానే వచ్చేశాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌. శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం నేడు థియేటర్లలో సందడి మొదలుపెట్టింది. మరి ట్విట్టర్‌లో పబ్లిక్ టాక్ ఎలా ఉందో ఓ లుక్కేయండి.   

Written by - Ashok Krindinti | Last Updated : Jan 10, 2025, 04:43 AM IST
Game Changer Twitter Review: గేమ్ ఛేంజర్ ట్విట్టర్ రివ్యూ.. ఇంటర్వెల్ ట్విస్ట్‌తో మైండ్ బ్లాక్..!

Game Changer Twitter Review and Public Talk: ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్ తరువాత రామ్ చరణ్‌ సోలో హీరోగా నటిస్తున్న మూవీ గేమ్‌ఛేంజర్. భారీ చిత్రాల దర్శకుడు శంకర్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తుండడం.. హైబడ్జెట్‌తో దిల్‌ రాజు నిర్మించడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించగా.. ఎస్‌జే సూర్య, శ్రీకాంత్, అంజలి, సముంద్రఖని కీలక పాత్రలు పోషించారు. సినిమా మొదటి నుంచి ఓ రేంజ్‌లో ఎక్స్‌పెటేషన్స్‌ ఉండగా.. ట్రైలర్‌ తరువాత మరింత పెరిగిపోయాయి. సంక్రాంతి సందర్భంగా నేడు (జనవరి 10)న గేమ్‌ఛేంజర్ ఆడియన్స్‌ ముందుకు వచ్చింది. మరి ఈ ఫెస్టివల్‌ సీజన్‌లో రామ్ చరణ్‌ గేమ్‌ఛేంజర్‌గా నిలిచారా..? ట్విట్టర్‌లో టాక్ ఎలా ఉంది..? ఇక్కడ చూద్దాం పదండి. 

ఆంధ్రప్రదేశ్‌లో ఒంటి గంటకే షోలు పడడంతో ట్విట్టర్‌లో ఫ్యాన్స్‌ హడావుడి ముందుగానే మొదలైంది. శంకర్ అద్భుతమైన సినిమా అందించారని అంటున్నారు. సినిమాలో ఆడియన్స్ లీనమై పోతారని.. రామ్ చరణ్‌ యాక్టింగ్‌తో తన పాత్రలకు మరింత బలాన్ని తీసుకువచ్చాడని చెబుతున్నారు. ఎస్‌జే సూర్య అద్భుతంగా నటించారని.. కియారా అద్వాణీ, అంజలి తమ పాత్రలను న్యాయం చేశారని.. పాటలు, విజువల్స్ బిగ్‌ స్క్రీన్‌పై విజువల్ ట్రీట్‌లాగా అనిపిస్తున్నాయన్నారు. నేపథ్య సంగీతం కీలక సన్నివేశాలలో ఎలివేషన్‌ను హైప్ చేసిందని రివ్యూలు ఇస్తున్నారు.

 

అప్పన్న పాత్రలో రామ్ చరణ్‌ యాక్టింగ్ అదిరిపోయిందని.. నేషనల్ అవార్డు పక్కా అని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.  రామ్ చరణ్‌ ఎంట్రీ అదిరిపోయిందని.. ఇంటర్వెల్ దుమ్ములేపారని చెబుతున్నారు. డోప్ సాంగ్ విజువలైజేషన్ ఓ రేంజ్‌లో ఉందంటున్నారు. 
 

మరికొందరు ఫస్ట్ హాఫ్ పాస్ అవుతుందని.. ఇంటర్వెల్ బ్లాక్, సాంగ్స్ బాగున్నాయని కామెంట్స్ చేస్తున్నారు. రామ్ చరణ్‌ IAS బ్లాక్‌లు బాగా వచ్చాయని.. అలాగే ఆసక్తికరమైన ఇంటర్వెల్ బ్లాక్ కూడా వచ్చిందని రివ్యూ ఇస్తున్నారు. ప్రేమకథ బోరింగ్‌గా ఉందని.. కామెడీ కూడా అతిగా ఉందంటున్నారు. అయితే రామ్ చరణ్ యాక్టింగ్.. థమన్ నేపథ్య సంగీతం చాలా బాగుందంటున్నారు. ఇంటర్వెల్ ముందు ట్విస్ట్‌ అదిరిపోయిందంటున్నారు.

 

 

అప్పన్న క్యారెక్టర్‌లో పవన్ కళ్యాణ్‌ను గుర్తు చేసుకుంటున్నారు. ఫస్ట్ చూస్తే యావరేజ్ అనిపించిందని.. కానీ సెకాండఫ్‌ తరువాత సినిమా గ్రాఫ్‌ మారిపోయిందంటున్నారు. ఫ్యాష్‌ బ్యాక్ సినిమాను నిలబెడుతుందని.. చాలా రేసీగా ఉందని రివ్యూలు ఇస్తున్నారు. మొత్తానికి మెగా ఫ్యాన్స్‌కు గేమ్‌ ఛేంజర్ తెగ నచ్చేసినట్లు ఉంది. ఇక మరోవైపు నెగిటివ్ రాయుళ్లు రంగంలోకి దిగిపోయారు. సినిమా రిలీజ్‌కు ముందు నుంచే బ్యాడ్ చేద్దామని కంకణం కట్టుకున్న బ్యాచ్.. డ్యూటీ మొదలెట్టేశారు. మరికాసేపట్లో మీ జీ తెలుగు న్యూస్‌లో పూర్తి రివ్యూ రానుంది.

 

 

 

 

Trending News