Video: మాస్క్ ధరించలేదని.. బండ బూతులు తిడుతూ వృద్దుడిపై మహిళ దాడి..

Woman attacks Elderly man in Flight: ముఖానికి మాస్క్ ధరించని ఓ మహిళ.. మాస్క్ ధరించనందుకు ఓ వృద్దుడిపై దాడికి పాల్పడింది. డెల్టా ఎయిర్ లైన్స్ విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 30, 2021, 06:49 PM IST
  • మాస్క్ ధరించలేదని విమానంలో వృద్దుడిపై మహిళ దాడి
  • దాడికి పాల్పడిన మహిళ కూడా మాస్క్ ధరించలేదు
  • దాడికి పాల్పడినందుకు మహిళ అరెస్ట్
Video: మాస్క్ ధరించలేదని.. బండ బూతులు తిడుతూ వృద్దుడిపై మహిళ దాడి..

Woman attacks Elderly man in Flight: విమానంలో ముఖానికి మాస్క్ (Face Mask) ధరించలేదన్న కారణంతో ఓ మహిళ వృద్దుడిపై దాడికి పాల్పడింది. దాడికి పాల్పడిన ఆ మహిళ కూడా మాస్క్ ధరించకపోవడం గమనార్హం. ఆగ్రహంతో ఊగిపోయిన ఆ మహిళ వృద్దుడిని బండ బూతులు తిడుతూ అతనిపై పిడిగుద్దులు, చెంపదెబ్బలు కురిపించింది. వృద్దుడిపై దాడికి ఆమె అరెస్ట్ అవక తప్పలేదు. దాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. డెల్టా ఎయిర్ లైన్స్ విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

నిజానికి ఆ సమయంలో వృద్దుడు భోజనం చేస్తున్నాడు. అందుకే ముఖానికి మాస్క్ ధరించలేదు. అది గమనించని సదరు మహిళ మాస్క్ ఎందుకు పెట్టుకోలేదని ఆయన్ను నిలదీసింది. భోజనం చేస్తున్నానని ఆ వృద్దుడు చెప్పే ప్రయత్నం చేసినా ఆమె వినిపించుకోలేదు. సరికదా... గట్టిగా అరుస్తూ ఆయన్ను బెదరగొట్టే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో ఇద్దరూ బూతులు తిట్టుకోగా.. వృద్దుడిపై ఆమె దాడికి పాల్పడింది. ఫ్లైట్ సిబ్బంది జోక్యం చేసుకుని ఆ మహిళను ఆమె సీట్లోకి తీసుకెళ్లి కూర్చోబెట్టారు. మాస్క్ ధరించాల్సిందిగా ఆమెకు సూచించారు. అందుకు ఆ మహిళ.. 'ముందు ఆ వృద్దుడికి చెప్పండి మాస్క్ పెట్టుకోమని...' అంటూ సిబ్బందిపై అరిచింది. 

 

ఆ తర్వాత కూడా ఇద్దరూ ఒకరినొకరు తిట్టుకుంటూ శాపనార్థాలు పెట్టుకున్నారు. విమానం జార్జియాలోని అట్లాంటా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యాక అక్కడి పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. దాడికి (Viral News) పాల్పడిన యువతిని ప్యాట్రికా కార్న్‌వాల్‌గా గుర్తించారు.

Also Read: RRR First Review: ఆర్ఆర్ఆర్ ఫస్ట్ రివ్యూ... ఎన్టీఆర్, రాంచరణ్ ఫ్యాన్స్‌ మధ్యన చిచ్చు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News