'దేఖ్ భాయ్ దేఖ్' అనే ప్రసిద్ధ కామెడీ షోలో కనిపించిన ప్రసిద్ధ దిగ్గజ నటి షమ్మి కన్నుమూశారు. ఆమె వయస్సు 89 సంవత్సరాలు. షమ్మి మరణవార్తను ఫ్యాషన్ డిజైనర్ సందీప్ కోస్లా వెల్లడించారు. ఫరా ఖాన్, బోమన్ ఇరానీ చిత్రం 'శీరీ ఫర్హాద్ కీ తో నికల్ పడీ' అనే చిత్రంలో చివరిసారిగా కనిపించారు. అమితాబ్ బచ్చన్ షమ్మి మరణంపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తంచేశారు. 'షమ్మీ అంటీ చాలా మంచి నటి. చలనచిత్ర పరిశ్రమలో ఎన్నో ఏళ్లుగా నటించి రాణించారు. తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నా' అని బిగ్ బీ ట్విట్టర్ లో పేర్కొన్నారు.
T 2735 - Shammi Aunty .. prolific actress, years of contribution to the Industry, dear family friend .. passes away ..!!
A long suffered illness, age ..
Sad .. slowly slowly they all go away .. pic.twitter.com/WYvdhZqo8X— Amitabh Bachchan (@SrBachchan) March 6, 2018
కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్న షమ్మి.. 64 సంవత్సరాల పాటు సినిమాల్లో నటించి 200కుపైగా చిత్రాలకు పనిచేశారు. ఆమె నటించిన 'హమ్ సాత్ సాత్ హై', 'గోపీ కిషన్', 'హమ్', 'కూలీ నెంబర్ 1' తదితర చిత్రాలు ఘనవిజయం సాధించాయి.
One of the finest actresses shammiji passes away leaving behind her memories on celluloid! She was a darling, always smiling, we will miss her! Deepest condolences to the family 🙏 #ripshammiji #ripshammi pic.twitter.com/cliGpHx93T
— Naved Jafri (@NavedJafri_BOO) March 6, 2018