Viral video of 13 feet King Cobra: పాము పేరు వింటేనే చాలామంది హడలిపోతారు. ఎప్పుడైనా అది సడెన్‌గా ప్రత్యక్షమైందో ఏం చేయాలో కాళ్లు చేతులు ఆడవు. సామాన్యులే కాదు కొన్నిసార్లు నిపుణులైన స్నేక్ క్యాచర్స్ సైతం బుసలు కొట్టే విష సర్పాలకు బెంబేలెత్తిపోతుంటారు. ముఖ్యంగా భారీ విష సర్పాలను పట్టుకోవాలంటే ఒకరిద్దరితో అయ్యే పని కాదు. కొన్నిసార్లు స్నేక్ క్యాచర్స్ టీమ్ మొత్తం రంగంలోకి దిగాల్సి ఉంటుంది. ఇలాగే థాయిలాండ్‌లో ఓ భారీ కింగ్ కోబ్రాను (King Kobra) పట్టుకునేందుకు దాదాపు 12 మంది స్నేక్ క్యాచర్స్ రంగంలోకి దిగారు.
ఇటీవల థాయిలాండ్ (Thailand) చోన్బురీ ప్రావిన్స్‌లోని ఓ బిజీ రోడ్డు పక్కన 13 అడుగుల కింగ్ కోబ్రా ప్రత్యక్షమైంది. దారినపోయేవాళ్లు ఆ భారీ విష నాగును చూసి భయపడిపోయారు. వెంటనే స్నేక్ క్యాచర్స్‌కు ఫోన్ ద్వారా సమాచారమిచ్చారు. భారీ విష నాగు కావడంతో ఆ పామును పట్టుకునేందుకు ఏకంగా 12 మంది టీమ్ రంగంలోకి దిగారు. అయినప్పటికీ ఆ పామును అదుపు చేయడం అంత సులువుగా సాధ్యం కాలేదు. ఒకరకంగా ఆ స్నేక్ క్యాచర్స్ టీమ్‌కు అది ముచ్చెమటలు పట్టించింది. భయంకరంగా బుసలు కొడుతూ వారిని కాటేసేందుకు యత్నించింది. చాకచక్యంగా వ్యవహరించిన టీమ్ సభ్యులు ఎట్టకేలకు ఆ కోబ్రాను పట్టుకోగలిగారు.
నిజానికి ఆ కోబ్రా (Snake Videos) గాయపడి ఉందని... దాని శరీరంపై గాయాలను గుర్తించామని స్నేక్ క్యాచర్స్ టీమ్ వెల్లడించింది. ప్రత్యేక చికిత్స కోసం ఆ పామును సమీపంలోని సంరక్షణ కేంద్రానికి తరలించినట్లు తెలిపింది. ఆ కోబ్రాను పట్టుకునేందుకు 12 మంది టీమ్ పడిన కష్టం ప్రస్తుతం సోషల్ మీడియాలో వీడియో రూపంలో వైరల్‌గా మారింది.
Also Read: Harbhajan Singh: క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి రాజకీయాల్లోకి హర్భజన్ సింగ్?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook