/telugu/photo-gallery/how-to-make-easy-and-delicious-bakery-style-plum-cake-here-pr-ocess-of-making-rv-187168 Plum Cake: క్రిస్మస్‌కు ఇంట్లోనే ప్లమ్‌ కేక్ చేసుకుందాం.. తయారీ విధానం ఇలా Plum Cake: క్రిస్మస్‌కు ఇంట్లోనే ప్లమ్‌ కేక్ చేసుకుందాం.. తయారీ విధానం ఇలా 187168

Hero Sudheer Babu sentional comments on Telangana Minister KTR: హీరో సుధీర్‌బాబు మంత్రి కేటీఆర్‌పై సరదాగా వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌లో తనకు పొలిటికల్ లీడర్ కంటే మంచి యాక్టర్ కనిపిస్తారన్నారు సుధీర్ (Sudheer). హైదరాబాద్ హైటెక్స్‌ లో జరుగుతోన్న ఇండియా జాయ్ కార్యక్రమానికి సుధీర్‌బాబు హాజయ్యారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్‌ను (KTR) ప్రశంసిస్తూ సరదాగా వ్యాఖ్యలు చేశారు సుధీర్. ఇక సుధీర్‌బాబు మాటలు విన్న కేటీఆర్.. ఆ మాటలను తన మనస్సులో పెట్టుకుంటానంటూ సరదాగా అన్నారు.

ఇద్దరి మధ్య జరిగిన సంభాషణలు కొద్దిసేపు నవ్వులు పూయించాయి. కేటీఆర్‌కు నేను పెద్ద ఫ్యాన్‌ని (Fan‌).. ఆయలో ఒక మంచి రాజకీయ నాయకుడితో పాటు ఒక మంచి నటుడు కూడా ఉంటాడంటూ సుధీర్ వ్యాఖ్యానించారు. ఒక నటుడు అన్నీ మరిచిపోయి పాత్రకు తగినట్లు నటించాలి.. అలాగే రాజకీయ నాయకుడు ప్రజలకు మంచి చేయాలంటే తన గురించి తన కుటుంబం గురించి మరిచిపోయి పనిచేయాలని సుధీర్ పేర్కొన్నాడు

అంతేకాదు ఒకవేళ ఫ్యూచర్‌‌లో తాను రాజకీయ నాయకుడిగా నటించాల్సి వస్తే కేటీఆర్‌ను అనుసరిస్తానని పేర్కొన్నారు.ఇక కేటీఆర్ సినిమాల్లోకి రానందుకు తనకు ఆనందంగా ఉందంటూ పంచ్ విసిరాడు సుధీర్ (Sudheer).

Also Read : Special Notes: 786 నంబర్ ఉన్న నోట్లు మీ దగ్గర ఉన్నాయా..? అయితే రూ.3 లక్షలు మీవే!

సుధీర్‌బాబు మాటలు విన్న మంత్రి కేటీఆర్‌ (KTR) స్పందిస్తూ.. ఏంటి సుధీర్.. నేను రాజకీయ నాయకుడి కాకుండా నటుడిగా కనిపిస్తున్నానా.. సరేసరే సుధీర్... ఇది నేను మనసులో పెట్టుకుంటా అన్నారు. ఈ విషయాన్ని నేను చాలా పాజిటివ్‌ వేలో చూస్తున్నా అని కేటీఆర్ (KTR) పేర్కొన్నారు.

Also Read : Eyy Bidda Idhi Naa Adda Telugu Promo: ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా సాంగ్ ప్రోమో చూశారా ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook 

Section: 
English Title: 
Hero Sudheer Babu sentional comments on Telangana Minister KTR
News Source: 
Home Title: 

Sudheer Babu : మంత్రి కేటీఆర్‌పై సుధీర్‌బాబు ఆసక్తికర వ్యాఖ్యలు

Sudheer Babu : మంత్రి కేటీఆర్‌పై సుధీర్‌బాబు ఆసక్తికర వ్యాఖ్యలు
Caption: 
twitter image
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

మంత్రి కేటీఆర్‌పై హీరో సుధీర్‌బాబు సరదా వ్యాఖ్యలు 

కేటీఆర్‌లో పొలిటికల్ లీడర్ కంటే మంచి యాక్టర్ కనిపిస్తారన్న సుధీర్

తాను రాజకీయ నాయకుడిగా నటించాల్సి వస్తే కేటీఆర్‌ను అనుసరిస్తానన్న హీరో

Mobile Title: 
Sudheer Babu : మంత్రి కేటీఆర్‌పై సుధీర్‌బాబు ఆసక్తికర వ్యాఖ్యలు
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Tuesday, November 16, 2021 - 21:17
Request Count: 
71
Is Breaking News: 
No