Aryan Khan Bail: షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌కు బుధవారం కూడా బెయిల్(Aryan Khan bail) లభించలేదు. వాదనలు పూర్తకానందువల్లే బెయిల్‌పై బాంబే హై కోర్టుల తీర్పు వెలువరించలేదు.
ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌పై మంగళవారం ప్రారంభమైన విచారణ.. మరుసటి రోజరుకు వాయిదా పడింది. బుధవారం మధ్యాహ్నం 2:30 తర్వాత తిరిగి విచారణ ప్రారంభమైనా ఇరు పక్షాల వాదనలు ముగియలేదు. వాదనలకు ఇంకా సమయం పడుతున్న కారణంగా.. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది ధర్మాసనం. అయితే గురవారమే తుది విచారణను పూర్తి చేసి.. నిర్ణయం తీసుకునే అవకాశముంది. గురువారం సాయంత్రం 3 తర్వాత వాదనలు విననుంది కోర్టు.
విచారణ వాయిదా కారణంగా ఆర్యన్ ఖాన్ మరో రోజు (బుధవారం కూడా) జైలులోనే (Aryan Khan in Jail) ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఇది షారుక్ కుటుంబానికి మరింత ఆందోళన కలిగించే విషయమనే చెప్పాలి.
Also read: ''spying for Pakistan'': పాక్‌కు రహస్యాలు చేరవేస్తున్న బీఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ అరెస్ట్
Also read: Nikki Tamboli: ఖతర్నాక్‌గా ఉన్న ఖత్రోంకి ఖిలాడి నిక్కీ లేటెస్ట్ ఫోటోషూట్
వాదనలు ఇలా..
ఆర్యన్ తరఫున మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ, ప్రముఖ న్యాయవాది సతీశ్ మనేషిండే వాదనలు వినిపించారు. ఆర్యన్ ఖాన్‌పై కుట్రపూరిత (Aryan Khan Drugs case) అభియోగాలు మోపారని కోర్టుకు తెలిపారు రోహత్గీ. ఆర్యన్‌ను వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవి వివరించారు.
దీనితో పాటు డ్రగ్స్ కేసు విషయంలో వాళ్లని నింధితులుగా కాకుండా.. బాధితులుగా పరిగణించాలని కోర్టుకు విన్నవించారు.
ఈ కేసులో ఎన్సీబీ తరఫున సొలిసిటర్ జనరల్ అనిల్ సింగ్ వాదనలు వినిపిస్తున్నారు. తమ వాదన వినిపించేందుకు గంట సమయం పడుతుందని బుధవారం కోర్టుకు తెలిపారు సింగ్. దీనితో ఆయన గురువారమే ఎన్సీబీ వాదనను వినిపించనున్నారు.
ఆర్యన్ ఖాన్ ఈ కేసులో ప్రధాన నింధితుడని.. బెయిల్ మంజూరైతే కీలక సాక్ష్యాలు తారుమరయ్యే అవకాశాలనున్నయనేది ఎన్సీబీ ప్రధాన వాదన. మరి ఈ కేసుపై రేపు బాంబే హై కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.
Also read: మహారాష్ట్రలో 2245 black fungus cases.. బ్లాక్ ఫంగస్ చికిత్సకు Amphotericin-B injections కేటాయింపు
Also read: China Puts City On Lockdown: కరోనా ధాటికి చైనాలో మరోసారి లాక్డౌన్
కేసు ఏమిటి?
ఈ నెల ఆరంభంలో ముంబయిల్ సముద్ర తీరంలో క్రూయిజ్ షిప్లో జరిగిన రేవ్ పార్టీని (Mubai drugs case) భగ్నం చేసి.. డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు ముంబయి పోలీసులు. పార్టీలో పాల్గొన్న ఆర్యన్ ఖాన్ సహా మూన్‌మూన్ ధామేచ, నుపుర్ సారిక, ఇస్మీత్ సింగ్, మోహక్ జస్వాల్, విక్రాంత్ ఛోకర్, గోమిత్ చోప్రా, అర్బాజ్ మర్చంట్లను అదుపులోకి తీసుకున్నారు. వీరంతా సంపన్నుల పిల్లలు, బాలీవుడ్‌కు సంబంధించిన వారే కావడం గమనార్హం. ఆర్యన్ ఖాన్ సహా పలువురిని తమ కస్టడీలోకి తీసుకున్న నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎస్సీబీ) విచారణ చేపట్టింది. వివిధ కోనాల్లో ఈ కేసుపై వివరాలను సేకరించింది. ఈ నేపథ్యంలో ఇంతకు ముందు ఆర్యన్ ఖాన్ తరఫున న్యాయవాదులు బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇటీవలే ఎన్సీబీ (Aryan Khan in NCB custody ) కస్టడీ సమయం ముగిసిన నేపథ్యంలో మరోసారి బెయిల్ కోసం ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.
Also read: Aryan Khan case: వాంఖడేపై వరుస ట్వీట్లతో 'మహా' మంత్రి నవాబ్ మాలిక్ సంచలన ఆరోపణలు!
Also read: Nawab Malik On Sameer Wankhede: 'డబ్బు కోసం బాలీవుడ్ యాక్టర్ల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు'
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి