Team India ఆటగాడు అజింక్య రహానే ఔట్‌తో కంగుతిన్న ఫ్యాన్, Viral Video

Ajinkya Rahane Dismissal Video : గత 18 ఏళ్లుగా అంతర్జాతీయ క్రికెట్ మండలి నిర్వహించే మెగా ఈవెంట్లలో తలపడిన ప్రతిసారి న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓటమిపాలవుతోంది. బ్యాట్స్‌మెన్ వైఫల్యం భారత అవకాశాలను దెబ్బకొట్టిందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

Written by - Shankar Dukanam | Last Updated : Jun 24, 2021, 12:19 PM IST
  • వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్లో టీమిండియా ఓటమి
  • గత 18 ఏళ్లుగా న్యూజిలాండ్ చేతిలో ఐసీసీ ఈవెంట్లలో వరుస ఓటములు
  • రహానే ఔట్ కావడంతో అభిమానులు తీవ్ర నిరాశ, షాక్ గురైన వీడియో
Team India ఆటగాడు అజింక్య రహానే ఔట్‌తో కంగుతిన్న ఫ్యాన్, Viral Video

Ajinkya Rahane Dismissal Video: టీమిండియా అభిమానులతో పాటు భారత జట్టు సైతం ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోతోంది. గత 18 ఏళ్లుగా అంతర్జాతీయ క్రికెట్ మండలి నిర్వహించే మెగా ఈవెంట్లలో తలపడిన ప్రతిసారి న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓటమిపాలవుతోంది. తాజాగా ఇదే ఫలితం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో రిపీట్ అయింది.

బ్యాట్స్‌మెన్ వైఫల్యం భారత అవకాశాలను దెబ్బకొట్టిందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. జూన్ 18న న్యూజిలాండ్, టీమిండియా మధ్య ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ టెస్ట్ ప్రారంబమైంది. అయితే వర్షం కారణంగా రెండు రోజుల ఆట తుడిచిపెట్టుకపోయింది. చివరికి ఐసీసీ ప్లాన్ ప్రకారం రిజర్వ్ డేలో ఫలితం వస్తుందా లేదా అనుమానాలు ఉండేవి. కానీ టీమిండియా బ్యాట్స్‌మెన్ ఆడిన తీరు చూస్తే న్యూజిలాండ్ ఈసారి కప్పు కొట్టేలా ఉందని భావించాను అయినా ఎక్కడో మూల గెలుస్తామనే ధీమా. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కేవలం దూకుడును ప్రదర్శిస్తాడని, సరైన సమయంలో తగిన నిర్ణయాలు తీసుకోవడంలో మరోసారి విఫలమయ్యాడని.. మేజర్ టోర్నీలు అందించే నాయకత్వం అతడిది కాదని WTC Final తరువాత మరోసారి విమర్శల వెల్లువ మొదలైంది.

Also Read: WTC Winner: న్యూజిలాండ్ జయకేతనం, కివీస్ చేతిలో టీమిండియాకు మరో పరాభవం

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ICC (@icc)

ముఖ్యంగా రిజర్వ్ డే రోజు టీమిండియా కీలక ఆటగాడు అజింక్య రహానే ఔటైన తీరు అభిమానులను బాధించింది. కివీస్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ సంధించిన బంతిని రహానే లెగ్ సైడ్ దిశగా ఆడే యత్నం చేయగా బ్యాట్‌ను ముద్దాడిన బంతి కీపర్ వాట్లింగ్ చేతుల్లో పడింది. అప్పటివరకూ ఎంతో ఉత్సాహంగా కెమెరాను చూసి గట్టిగా అరుస్తూ, విన్యాసాలు చేసిన ఓ అభిమాని.. రహానే ఔట్ అయినట్లు అంపైర్ ప్రకటించగానే కంగుతిన్నాడు. ఇందుకు సంబంధించి వీడియో (Ajinkya Rahane Dismissal Video) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రహానే వికెట్ ఎంత కీలకమో ఆ వీక్షకుడి హావభావాలు చెప్పకనే చెబుతున్నాయి.

Also Read: Also Read: ICC Test Rankings: ఐసీసీ టెస్ట్ ర్యాకింగ్స్‌లో టాప్ లేపిన Ravindra Jadeja 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News