TS Medical staff recruitment notification:హైదరాబాద్: కరోనా సెకండ్ వేవ్‌లో పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్న తరుణంలో కరోనా రోగుల తాకిడిని తట్టుకోలేక ఆస్పత్రులు సైతం చేతులెత్తేసే పరిస్థితి తలెత్తింది. కరోనా రోగులకు తగినంత ఆక్సీజన్ నిల్వలు, రెమ్‌డిసివిర్ ఇంజెక్షన్స్ (Remdesivir injection) లేకపోవడం అందుకు ఓ కారణమైతే.. అసలు రోగుల సంఖ్యకు సరిపడే స్థాయిలో వైద్య సిబ్బంది లేకపోవడం మరో ప్రధాన సమస్యగా మారింది. దీంతో వైద్య సిబ్బంది కొరతను అధిగమించేందుకు తెలంగాణ సర్కార్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రగతి భవన్‌లో ఆదివారం సీఎం కేసీఆర్ నేతృత్వంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఈ అంశంపైనే కీలకంగా చర్చించిన అనంతరం వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ పద్దతిలో 50 వేల డాక్టర్లు, నర్సులు, టెక్నీషియన్ల పోస్టులను భర్తీ చేయాలని (Telangana health department recruitment) రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం అందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది.
Also read: Fake SMS alert: కొవిడ్-19 వ్యాక్సిన్ ఫ్రీ రిజిస్ట్రేషన్ పేరిట Cyber frauds
తెలంగాణ సర్కార్ (Telangana govt) విడుదల చేసిన ఈ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ప్రకారం ఎంపికైన అభ్యర్థులకు మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్టుకు నెలకు రూ.లక్ష రూపాయలు, MBBS చేసిన వారికి రూ.40 వేలు, ఆయూష్ డాక్టర్లకు (Aayush doctors) రూ.35 వేలు రూపాయలు, స్టాఫ్ నర్సులకు రూ.23 వేలు అలాగే ల్యాబ్ టెక్నీషియన్లకు రూ.17 వేల వేతనం అందనుంది. ఇప్పటికే పదవీ విరమణ చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించిన సర్కార్... ఈ నెల 22వ తేదీ వరకు దరఖాస్తు గడువు విధించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Telangana govt: తెలంగాణలో 50 వేల మెడికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్