Priyanka Gandhi: రాబర్ట్ వాద్రాకు కోవిడ్-19 పాజిటివ్, ఎన్నికల ర్యాలీలు రద్దు చేసుకున్న ప్రియాంక గాంధీ

Robert Vadra Tests Covid19 Positive | భర్త రాబర్ట్ వాద్రాకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఆమె తన పర్యటనలు మొత్తం రద్దు చేసుకున్నారు. అసోం, తమిళనాడు, కేరళలో ఎన్నికల ప్రచారం పాల్గొనాల్సి ఉండగా, ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా కరోనా బారిన పడ్డారు.

Written by - Shankar Dukanam | Last Updated : Apr 2, 2021, 04:47 PM IST
  • ప్రియాంకా గాంధీ వాద్రా భర్త రాబర్ట్ వాద్రాకు కరోనా పాజిటివ్
  • భర్తకు కోవిడ్19 పాజిటివ్ తేలడంతో ఎన్నికల ర్యాలీ రద్దు చేసుకున్న ప్రియాంక
  • రాబర్ట్ వాద్రాతో కలిస సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నానని ఆమె వెల్లడి
Priyanka Gandhi: రాబర్ట్ వాద్రాకు కోవిడ్-19 పాజిటివ్, ఎన్నికల ర్యాలీలు రద్దు చేసుకున్న ప్రియాంక గాంధీ

Robert Vadra Tests Covid19 Positive: కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ వాద్రాకు చుక్కెదురైంది. భర్త రాబర్ట్ వాద్రాకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఆమె తన పర్యటనలు మొత్తం రద్దు చేసుకున్నారు. అసోం, తమిళనాడు, కేరళలో ఎన్నికల ప్రచారం పాల్గొనాల్సి ఉండగా, ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా కరోనా బారిన పడ్డారు. ఇప్పటికే పలువురు నేతలు, మంత్రులకు కరోనా సోకగా రాబర్ట్ వాద్రా ఆ జాబితాలో చేరిపోయారు.

తన పర్యటనలు రద్దు చేసుకుంటున్నట్లు తెలిపిన ప్రియాంక గాంధీ వాద్రా, వీడియో ద్వారా ప్రజలను క్షమాపణలు కోరారు. రాబర్ట్ వాద్రాకు కరోనా సోకిన కారణంగా, ప్రస్తుతం తాను ఐసోలేషన్‌లో ఉన్నానని తెలిపారు. కరోనా నిర్ధారణ పరీక్షలలలో తనకు నెగటివ్‌గా తేలిందని, అయితే వైద్యుల సలహా మేరకు సెల్ఫ్ ఐసోలేషన్‌కు వెళ్తున్న కారణంగా తన పర్యటన రద్దు చేసుకున్నానని ;ప్రియాంక గాంధీ వాద్రా(Priyanka Gandhi Vadra) వెల్లడించారు. 

Also Read: West Bengal Election 2021: ముందు అమిత్ షాను కంట్రోల్ చెయండి, PM Modiకి మమతా బెనర్జీ సవాల్

తన కోసం పర్యటనకు వస్తున్న వారికి తాజాగా ప్రచార ర్యాలీలు రద్దు చేసుకుంటున్న కారణంగా ప్రజలకు క్షమాపణ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ ఎన్నికలలో విజయం సాధించాలని ఆకాంక్షించారు. చివరిదశ పోలింగ్‌లో భాగంగా ఫెడ్యూల్ ప్రకారం కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ నేడు అసోంలో పర్యటించాల్సి ఉంది. తాను ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నానని, ఆందోళన అక్కరేదని పేర్కొన్నారు.

కాగా, రాబర్ట్ వాద్రా సైతం తనకు కరోనా సోకిన విషయాన్ని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ‘కరోనా సోకిన పేషెంట్‌ను కలిశాను. నాకు కూడా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అయితే ఏ లక్షణాలు లేవు. కోవిడ్19(COVID-19) నిబంధనల ప్రకారం నేను, ప్రియాంక ఐసోలేషన్‌లో ఉన్నాం. పిల్లలు మాతో లేనందుకు వారికి, ఇంటి దగ్గర ఉన్న అందరికీ కోవిడ్19 నెగటివ్ అని రిపోర్టులో తేలింది. మా క్షేమం కోరి సందేశాలు పంపుతున్న అందరికీ ధన్యవాదాలు’ అంటూ పోస్టులో రాసుకొచ్చారు.

Also Read: Kumbh Mela 2021 Photos: ఘనంగా ప్రారంభమైన హరిద్వార్ కుంభమేళా, ఫొటో గ్యాలరీ 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News