Telangana: కరోనాను నిర్లక్ష్యం చేయవద్దు, రోజువారీగా COVID-19 Bulletin విడుదల చేయాలని హైకోర్టు ఆదేశం

COVID-19 Bulletin In Telangana: మహారాష్ట్రతో పాటు దక్షిణాది రాష్ట్రాలలో కరోనా కేసులు పెరుగుతున్నాయని, కనుక రేపటినుంచి రోజువారీగా కోవిడ్-19 హెల్త్ బులెటిన్ విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

Written by - Shankar Dukanam | Last Updated : Feb 25, 2021, 06:28 PM IST
  • తెలంగాణలోనూ కొన్ని రోజుల కిందట కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ కేసులు నమోదయ్యాయి
  • ప్రతిరోజూ కోవిడ్19 హెల్త్ బులెటిన్ అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం భావించింది
  • రేపటినుంచి రోజువారీగా కోవిడ్-19 హెల్త్ బులెటిన్ విడుదల చేయాలని హైకోర్టు స్పష్టం
Telangana: కరోనాను నిర్లక్ష్యం చేయవద్దు, రోజువారీగా COVID-19 Bulletin విడుదల చేయాలని హైకోర్టు ఆదేశం

Telangana COVID-19 Bulletin: తెలంగాణలోనూ కొన్ని రోజుల కిందట కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ కేసులు నమోదయ్యాయి. అయితే కొన్నిరోజులుగా కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిందని, ప్రతిరోజూ కోవిడ్19 హెల్త్ బులెటిన్ అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం భావించింది. ఈ క్రమంలో తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా సీరం సర్వే చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. 

కరోనా కేసులు నమోదువుతున్న సమయంలోనూ రిపోర్టులు తమకు సరిగ్గా సమర్పించడం లేదని తెలంగాణ(Telangana) హైకోర్టులో గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి పలు విషయాలపై ఆదేశాలు జారీ చేయడం తెలిసిందే. తాజాగా తెలంగాణలో కరోనా పరిస్థితులపై విచారణ చేపట్టింది. సీరం సర్వే నిర్వహించి, సర్వేలో తేలిన విషయాలు, నివేదిక సిఫార్సులు అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. జనవరి 25 నుంచి ఫిబ్రవరి 12 వరకు చేసిన కరోనా పరీక్షలకు సంబంధించిన నివేదికను ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించింది.

Also Read: Migraine: తలనొప్పే కదా అని ఈజీగా తీసుకోవద్దు, Neck Pain వస్తే డాక్టర్‌ను సంప్రదించాలి

ఆ సమయంలో తెలంగాణ వ్యాప్తంగా 1,03,737 ఆర్టీపీసీఆర్ (RTPCR) పరీక్షలు, 4,83,266 యాంటీజెన్‌ పరీక్షలు చేసినట్లు తెలిపింది. తాము గతేడాది చివరి ఆరు నెలలలో 3 పర్యాయాలు సీరం సర్వేలు నిర్వహించినట్లు హైకోర్టుకు వివరించారు. అయితే ప్రస్తుతం కరోనా వైరస్(Corona Vaccine) రెండో దశ నడుస్తున్నందున అంత తేలికగా తీసుకోకూడదని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.

Also Read: Effect Of COVID-19 Vaccine: కరోనా టీకాల ప్రభావం.. అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే

మహారాష్ట్రతో పాటు దక్షిణాది రాష్ట్రాలలో కరోనా కేసులు పెరుగుతున్నాయని, కనుక రేపటినుంచి రోజువారీగా కోవిడ్-19 హెల్త్ బులెటిన్ విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం  అవసరమైతే కరోనా నిబంధనలు సవరించాలని సైతం తెలంగాణ ప్రభుత్వానికి సూచించినట్లు సమాచారం. తెలంగాణలో కరోనా పరిస్థితులపై మార్చి 18న హైకోర్టు మరోసారి విచారించనుంది.

Also Read: COVID-19 Vaccine: కరోనా వ్యాక్సిన్ తీసుకునే మద్యం ప్రియులకు చేదువార్త.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News