Kodali nani: ఆంధ్రప్రదేశ్ పంచాయితీ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని ప్రతిపక్ష నేత చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని మరోసారి విమర్శలు గుప్పించారు. చంద్రబాబును..తమ్ముళ్లు పిచ్చాసుపత్రిలో చేర్చాలని హితవు పలికారు.
ఆంధ్రప్రదేశ్‌లో నాలుగుదశల్లో జరిగిన పంచాయితీ ఎన్నికలు( Panchayat Elections ) ముగిశాయి. 80.37 శాతం పంచాయితీల్ని దక్కించుకున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ( Ysr congress party ) చెబుతోంది. మరోవైపు ప్రతిపక్ష తెలుగుదేశం మాత్రం 42 శాతం పంచాయితీల్ని సాధించామంటోంది. ఈ నేపధ్యంలో ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని చంద్రబాబుపై మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. 42 శాతం విజయం ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలని కొడాలి నాని ప్రశ్నించారు. చంద్రబాబుకు పిచ్చెక్కి మాట్లాడుతున్నారని..గెలిచిన 42 శాతం అభ్యర్ధులెవరో చెప్పాలని సవాల్ చేశారు. టీడీపీ నేతలు చంద్రబాబు (Chandrababu )ను ఎర్రగడ్డ పిచ్చాసుపత్రికి పంపించడం ఖాయమని ఎద్దేవా చేశారు. తమ అధినేత వైఎస్ జగన్ ( Ap cm ys jagan )..కుప్పంలో చంద్రబాబుకు చుక్కలు చూపించారని స్పష్టం చేశారు. ఒక్క కుప్పంలోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 75 స్థానాలు గెల్చినప్పుడు..టీడీపీ 42 శాతం గెలవడం ఎలా సాధ్యమని నిలదీశారు. చంద్రబాబు ఇప్పటికైనా పిచ్చి ప్రేలాపణలు మానుకోవాలని హితవు పలికారు.
జూమ్ యాప్ బాబు జూమ్‌లో కూర్చుని పగటి కలలు కంటున్నారని మండిపడ్డారు. బాబు పిచ్చితో ఇప్పటికే తెలంగాణ(Telangana )లో పార్టీ భూస్థాపితమైందని..ఇప్పటికైనా తమ్ముళ్లంతా ఆన్ని పిచ్చాసుపత్రికి పంపించకపోతే ఏపీలో కూడా భూస్థాపితమవుతుందన్నారు. గుర్తు లేకుండా జరిగిన ఎన్నికల్లోనే ప్రజలు జగన్‌కు బ్రహ్మరధం పడితే..ఇక గుర్తుతో జరిగే మున్సిపల్ ఎన్నిక ( Municipal elections )ల్లో విజయం ఎలా ఉంటుందో ఊహించుకోండని మంత్రి కొడాలి నాని ( Minister kodali nani ) చెప్పారు. త్వరలో జరిగే ఎన్నికల్లో మున్సిపాల్టీ, కార్పొరేషన్లను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
Also read: Ys jagan: పంచాయితీ ఎన్నికల్లో విజయంపై మంత్రి పెద్దిరెడ్డిని అభినందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook