Master Telugu movie pre-release business | తమిళ స్టార్ హీరో విజయ్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటించిన మాస్టర్ మూవీ అభిమానులకు సంక్రాంతి కానుకగా ఆడియెన్స్ ముందుకు వస్తోంది. ఏకకాలంలో జనవరి 13న తమిళం, తెలుగు, హిందీ, మళయాళం భాషల్లో విడుదల కానుంది. మాస్టర్ మూవీ తమిళ వెర్షన్‌కి తగినట్టుగానే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నిర్మాతలు ఆశించిన స్థాయిలో ప్రీ-రిలీజ్ బిజినెస్ చేస్తున్నట్లు సమాచారం.
సీడెడ్, నెల్లూరులను మినహాయించి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని అన్ని సర్క్యూట్లలో మాస్టర్ మూవీ ప్రీ-రిలీజ్ బిజినెస్ బాగున్నట్టు టాలీవుడ్ టాక్. మాస్టర్ మూవీ తెలుగు వెర్షన్ థియేట్రికల్ రైట్స్ దక్కించుకున్న చిత్ర నిర్మాణ సంస్థ ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్‌కి లాభాల పంట పండినట్టే అనే టాక్ ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే,
విజయ్ సినిమాలకు చాలావరకు తెలుగు రాష్ట్రాలలో మంచి డిమాండ్ ఉంది. గతంలో విజయ్ ( Vijay ) సినిమాలు బాక్సాఫీస్ వద్ద బాగా పర్‌ఫామ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే మాస్టర్ మూవీ కూడా తెలుగు ఆడియెన్స్‌ని ఎంటర్‌టైన్ చేయడం ఖాయం అని మూవీ యూనిట్ వర్గాలు భావిస్తున్నాయి.
Also read : Master movie: హీరో విజయ్‌కి, తమిళ సర్కార్‌కి కేంద్రం ఊహించని షాక్
లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా తెలుగులో క్రాక్ ( Krack movie ), రెడ్, ఆర్య, అల్లుడు అదుర్స్ లాంటి చిత్రాల నుండి గట్టి పోటీని ఎదుర్కోనుంది. సంక్రాంతి అంటేనే తెలుగునాట పెద్ద చిత్రాలకు మంచి సీజన్. మరి అటువంటి పండగ సీజన్‌లో పెద్ద చిత్రాలతో పోటీపడేందుకు బరిలో దిగుతున్న మాస్టర్ ( Master Telugu movie ) ఏ మేరకు విజయం సాధిస్తాడో వేచిచూడాల్సిందే మరి.
Also read : Master teaser: యూట్యూబ్‌లో దుమ్ములేపుతున్న టీజర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Master Telugu movie: విడుదలకు ముందే మాస్టర్ దూకుడు