దుబాయ్: ఢిల్లీ క్యాపిటల్స్ ఆఫ్ స్పిన్నర్ రవింద్రన్ అశ్విన్ ( R Ashwin ) తన ప్రత్యర్థి ఆటగాళ్లకు ట్విటర్ ద్వారా ఓ వార్నింగ్ ఇచ్చాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ( DC vs RCB match ) జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్ ఆరోన్ ఫించ్‌ను మన్కడింగ్ ( Mankading ) చేసే అవకాశం వచ్చినా.. అలా చేయకుండా వార్నింగ్ ఇచ్చి వదిలేసిన అశ్విన్.. ఇదే విషయాన్ని ట్విటర్ ద్వారా చెబుతూ మరోసారి ఇలాంటి ఛాన్స్ ఇస్తే.. మన్కడింగ్ చేయకుండా మాత్రం ఊరుకోనని స్పష్టం చేశాడు. ఈ ఐపిఎల్ సీజన్ కి ఇదే ఫస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అని స్పష్టంచేసిన అశ్విన్.. ఇక వార్నింగ్స్ ఉండవంటూ తేల్చిచెప్పేశాడు.
'First and final warning for 2020' 😂@ashwinravi99 | #Dream11IPL pic.twitter.com/Bq1B0rsXWM
— IndianPremierLeague (@IPL) October 5, 2020
ఇకపై జరిగే ఆటల్లో ఇలా ఎవరైనా ఆటగాడు క్రీజు వదిలి ముందుకు వెళ్తే.. కచ్చితంగా మన్కడింగ్ చేస్తా అని చెప్పిన రవిచంద్రన్ అశ్విన్.. తాను ఈ విషయాన్ని ఎటువంటి దాపరికాలు లేకుండా అధికారికంగానే చెబుతున్నా అంటూ మందలించాడు. ఆ తర్వాత తనని తప్పు పట్టి లాభం లేదని అశ్విన్ చెప్పకనే చెప్పేశాడన్న మాట. ఈ ట్వీట్‌లో ఢిల్లీ చీఫ్ కోచ్ రికీ పాంటింగ్ ( Ricky ponting ), ఆరోన్ ఫించ్‌ను ( Aaron Finch ) ట్యాగ్ చేశాడు. ఏదేమైనా తాము స్నేహితులమే అంటూ అశ్విన్ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు.
Let’s make it clear !! First and final warning for 2020. I am making it official and don’t blame me later on. @RickyPonting #runout #nonstriker @AaronFinch5 and I are good buddies btw.😂😂 #IPL2020
— Ashwin 🇮🇳 (@ashwinravi99) October 5, 2020
ఐపిఎల్ 2020లో తమ బౌలర్స్ మన్కడింగ్ చేయకూడదని పాంటింగ్ గతంలోనే సూచించిన నేపథ్యంలో అశ్విన్ అతడినే ట్యాగ్ చేస్తూ ఈ ట్వీట్ చేయడం గమనార్హం.
#Managers while #boys break the #rules
VS#Managers while #girls break the #rules 😉😉#Ashwin #IPL #IPL2020 #Finch
#RCBvDC #Butler #RRvKXIP #Runout pic.twitter.com/ycd4yFGYvk— P*K*🙏 (@iPKotte) October 6, 2020
ఇదిలావుంటే, మరోవైపు అశ్విన్‌పై సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ ( Memes viral on R Ashwin ) అవుతున్నాయి. పాంటింగ్‌కే భయపడి ఆగిపోయావా అశ్విన్ అంటూ నెటిజెన్స్ జోకులు పేల్చుతున్నారు.
#RCBvDC
Ashwin didn't Mankad Finch
Meanwhile Buttler: pic.twitter.com/vfRnIQ8Trb— Shivani (@meme_ki_diwani) October 5, 2020