SBI ATM: ఎస్‌బీఐ ఏటీఎం నుంచి డబ్బు తీస్తున్నారా ? ఈ విషయాలు గుర్తుంచుకోండి

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank Of India ) తన వినియోగదారులకు సేఫ్ బ్యాంకింగ్ అందిచడంలో భాగంగా ఏటీఎం నియమాల్లో కీలక మార్పులు చేసింది.

Last Updated : Sep 15, 2020, 11:43 PM IST
    • స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank Of India ) తన వినియోగదారులకు సేఫ్ బ్యాంకింగ్ అందిచడంలో భాగంగా ఏటీఎం నియమాల్లో కీలక మార్పులు చేసింది.
    • ఒక వేళ మీరు స్టేట్ బ్యాంకు ఖాతాదారులు అయితే మీరు డబ్బు తీసే సమయంలో వన్ టైమ్ పాస్ వర్డ్ ( OTP) ఎంటర్ చేయాల్సిదే.
    SBI ATM: ఎస్‌బీఐ ఏటీఎం నుంచి డబ్బు తీస్తున్నారా ? ఈ విషయాలు గుర్తుంచుకోండి

    స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank Of India ) తన వినియోగదారులకు సేఫ్ బ్యాంకింగ్ అందిచడంలో భాగంగా ఏటీఎం నియమాల్లో కీలక మార్పులు చేసింది. ఒక వేళ మీరు స్టేట్ బ్యాంకు ఖాతాదారులు అయితే మీరు డబ్బు తీసే సమయంలో వన్ టైమ్ పాస్ వర్డ్ ( OTP) ఎంటర్ చేయాల్సిదే.

     

     ఎస్‌బీఐ ఏటీఎం నుంచి మీరు రూ.10 వేలకన్నా ఎక్కువ డబ్బు తీయాల్సి వస్తే మాత్రం ఈ నిబంధనలు మీకు ఖచ్చింతంగా వర్తిస్తాయి. ఈ కొత్త నియమాలు ఈ నెల 18 నుంచి అమలు కానున్నాయి.  దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని ఏటీఎం కేంద్రాల్లో ఓటిపి ఆధారిత విత్ డ్రా సిస్టమ్ అందుబాటులోకి రానుంది.

    ఒక వేళ మీరు ఓటిపీ ఎంటర్ చేయలేకపోతే డబ్బు డ్రా చేయలేదు. కరెక్ట్ ఓటిపి ఎంటర్ చేస్తేనే మీకు రూ.10 వేలు లేదా అంతకు మించి డబ్బును మీరు తీసుకోవచ్చు. ఒక వేల మీరు రూ.10 వేల కన్నా తక్కువ డబ్బును తీసుకోవాలి అనుకుంటే మాత్రం వన్ టైమ్ పాస్ వర్డ్ అవసరం లేదు.

    నిజానికి ఈ విధానం ఈ ఏడాది జనవరిలోనే అమలులోకి వచ్చింది. ప్రస్తుతం  రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు మాత్రమే ఈ విధానం అమలు ఉంది కాగా ఈ నెల 18 నుంచి పూర్తిస్థాయిలో అమలు అవుతుంది. 

    •  

    Trending News